గాడ్గే జీవితం అందరికి ఆదర్శప్రాయం..
మెట్టుగూడ లో సంత్ గాడ్గే బాబా 149 వ జయంతి
సికింద్రాబాద్ ఫిబ్రవరి 23 (ప్రజామంటలు) :
మెట్టుగూడ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సంత్ గాడ్గే బాబా 149వ జయంతి వేడుకలను ఆదివారం బిజెపి రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షులు గుండగోని భరత్ గౌడ్ సంత్ గాడ్గే బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం భరత్ గౌడ్ మాట్లాడుతూ, మహారాష్ట్రలో పుట్టిన మట్టిలో మాణిక్యం సంత్ గాడ్గే బాబా అని స్వచ్ఛభారత్ సృష్టికర్త అని కొనియాడారు. గాడ్గే బాబా తన ఆధ్యాత్మిక చింతనతో రచనల ద్వారా సమాజానికి దేశభక్తి దైవభక్తి లాంటి అంశాలపై అవగాహన కల్పించారన్నారు. రాజేశ్వరి మాట్లాడుతూ సంత్ గాడ్గే బాబా రజక కుటుంబంలో పుట్టినందున ప్రభుత్వాలు మారినప్పటికీ ఇప్పటి వరకు సరైన గౌరవం దక్కలేదన్నారు. ఈ మహనీయునికి సేవలను గుర్తించి ప్రభుత్వాలు అధికారంగా గాడ్గే బాబా జయంతి వర్ధంతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
మహారాష్ట్రలో ఒక రజక కుటుంబాల్లో పుట్టిన సంత్ గాడ్గే బాబా వీధిలో చెత్తను అంత ఊడ్చి శుభ్రం చేసి పరిశుభ్రతను పాటించాలని స్వచ్ఛ భారత్ అంటే ఏమిటో ఆరోజుల్లోనే సమాజానికి తెలియజేశారని అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వాలని అన్నారు. సంత్ గాడ్గే బాబా పేద రోగుల కోసం భవనాలను విద్యాసంస్థలను నిర్మించారని కొనియాడారు. బీజేవైఎం సిటీ ప్రెసిడెంట్ శివాజీ ప్రభు గుప్త ఓబీసీ మోర్చా కో కన్వీనర్ సరోజ చందు,రజక మహిళలు బిజెపి నాయకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు ..... కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్
