కన్నవారిని విస్మరించే కారుణ్య ఉద్యోగులు జాగ్రత్త..
-సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్
జగిత్యాల ఫిబ్రవరి23:
కన్న తల్లి,దండ్రులను పోషించక నిరాధరిస్తున్న అనారోగ్య కారుణ్య నియామక పథకం కింద నియామకమైన కారుణ్య నియామక ఉద్యోగులైన కొడుకులు ,కూతుర్లు అనారోగ్య కారుణ్య నియామక పథకం రూల్స్ ప్రకారం సస్పెన్షన్ లేదా ఆ ఉద్యోగం నుంచి తొలగించ బడుతారని తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హెచ్చరించారు..శనివారం జిల్లా కేంద్రంలోని అసోసియేషన్ కార్యాలయం కౌన్సిలింగ్ కేంద్రం లో జిల్లాలోని కథలాపూర్, జగిత్యాల మండలాలకు చెందిన ఇద్దరు అనారోగ్య కారుణ్య నియామక ఉద్యోగులు వారి తల్లిదండ్రులను పోషించక పోవడంతో ఆ వృద్ధ తల్లిదండ్రుల అభ్యర్థన పై ఆ ఉద్యోగులను పిలిపించిన హరి ఆశోక్ కుమార్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ కౌన్సెలింగ్ కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. వారికి అనారోగ్య కారుణ్య నియామక పథకం రూల్స్ పై, వయోవృద్ధుల చట్టంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ, అనారోగ్యంతో వారి తల్లిదండ్రులు తమ కొడుకులకు,కూతుర్లకు అనారోగ్య కారుణ్య నియామక పథకం కింద తమ స్థానంలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తే ఆ తల్లిదండ్రులను జీవితాంతం ఆ ఉద్యోగం పొందిన వారు పోషించాల్సి ఉంటుందని,నిరదరిస్తే సంబంధించిన జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే వారిని సస్పెండ్ ,ఉద్యోగం నుంచి తొలగించే అధికారం అనారోగ్య కారుణ్య నియామక పథకం రూల్స్ లో ఉందన్నారు. కౌన్సెలింగ్ కు స్పందించిన ఆ ఉద్యోగులు స్టాంపు పేపర్ పై తమ తల్లిదండ్రులను ఏ లోటు లేకుండా చూసుకుంటామని ఒప్పంద పత్రం రాసిచ్చారు.
ఆ తల్లిదండ్రులు హరి ఆశోక్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కౌన్సెలింగ్ లో సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,కౌన్సెలింగ్ ప్రతినిధులు పబ్బా శివానందం,జీ.రాజ్ మోహన్,వెల్ముల ప్రకాష్ రావు,పి.హన్మంత్ రెడ్డి,విఠల్ లు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి

బౌద్దనగర్ కార్పొరేటర్ కంది శైలజ పర్యటన

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు జగిత్యాల జిల్లా అర్ టి ఏ మెంబర్.

జగిత్యాల పట్టణ ఆవోపా ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం

జగిత్యాల పట్టణ ఆవోపా ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం

భయం వీడితే...జయం మనదే..
.jpg)
మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు ..... కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)