వేరే అమ్మాయితో సహజీవనం - చితకబాదిన భార్య తరపు బంధువులు
రెడ్ హ్యాండెడ్ గా భార్యకు దొరికిన జీహెచ్ఎమ్సీ ఉన్నతాధికారి
సికింద్రాబాద్ ఫిబ్రవరి 21 (ప్రజామంటలు) :
జీహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ అడ్మిన్ లో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న జానకిరామ్ వేరే మహిళతో ఉండగా భార్య ఎస్. కళ్యాణి శుక్రవారం ఉదయం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. స్థానికులు, వారాసిగూడ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..గతంలో మెదక్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన ఎస్.వి జానకి రామ్ ఇటీవల అక్కడి నుంచి బదిలీ అయి జీహెచ్ఎమ్సీ అడ్మిన్ విభాగంలో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్నారు.
వారాసిగూడ చర్చిగల్లీలో నివాసం ఉంటున్నారు. అయితే గత కొన్ని నెలలుగా భర్త జానకిరామ్ ఇంటికి రాకుండా వేరే అమ్మాయితో కలసి ఉంటున్నాడనే పక్కా సమాచారంతో తమ బంధువులతో కలసి భార్య కళ్యాణి శుక్రవారం ఉదయం మధురానగర్ కాలనీ లోని ఓ అపార్ట్ మెంట్ లోకి వెళ్ళి, తన భర్తను, ఓ అమ్మాయిని పట్టుకున్నారు. జానకిరామ్ తనకంటే 20 ఏండ్ల చిన్న వయస్సున్న అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ, అతడితో బంధువులు, భార్య కళ్యాణి వాగ్వివాదానికి దిగారు.
వీరి మద్య పెనుగులాట జరగడంతో కోపొద్రిక్తులైన కళ్యాణి బంధువులు జానకిరామ్ తో పాటు ఇంట్లో ఉన్న యువతిని బాగా చితకబాదారు. పక్కనే ఉన్న వారు డయల్ 100 కు కాల్ చేయడంతో వారాసిగూడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, జానకిరామ్, దివ్య అనే అమ్మాయిని ట్రీట్మెంట్ కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కళ్యాణి, బంధువులు వారాసిగూడ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి, కంప్లయింట్ ఇచ్చారు.
తన భర్త జానకిరామ్ ఎక్కడ పనిచేసిన అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో శారీరక సంబంధాలు పెట్టుకుంటాడని భార్య కళ్యాణి ఆరోపించింది. 2018 లో జానకిరామ్ తో తనకు తిరుపతిలో పెండ్లి అయిందన్నారు. అయితే జానకిరామ్ కు అప్పటికే పెండ్లి అయినట్లు తమకు చెప్పకుండా మోసం చేశారని అన్నారు.
తాను కవల పిల్లల కలిగిన గర్బం దాల్చినప్పుడు తన కడుపులో తన్నిన భర్త జానకిరామ్ అబార్షన్ కు కారణమయ్యాడని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో తనను అవమాన పరిచేవాడని, భర్త, అతడి ప్రియురాలు దివ్య, అత్త, తో పాటు జానకిరామ్ కుటుంబసభ్యులపై కళ్యాణి వారాసిగూడ లో కంప్లయింట్ ఇవ్వగా, వారిపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ సైదులు, అడ్మిన్ ఎస్ఐ సుధాకర్ తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం

రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,

గాంధీ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి- జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు తల్లిదండ్రుల ఫిర్యాదు.

నేటి నుండి ధర్మపు రీశుల తెప్పోత్సవాలు

అవినీతి, రాజకీయాల రహితంగా ధర్మపురి దేవస్థానం

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవము ముగింపు

అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి
