నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే - రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ ప్రారంభించాం - శ్రీధర్ బాబు
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ఒకే సంవత్సరంలో 56వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ధర్మపురి పట్టణంలోని బ్రాహ్మణ సంఘంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర లోపే 56 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, నిరుద్యోగుల నైపుణ్యాన్ని పెంచే విధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ ప్రారంభించామని, గత ప్రభుత్వ హయంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని, ఓటమి భయంతోనే నరేందర్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం చేయడం జరుగుతుందని, 317 జీవో సడలింపు పై న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నామని, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా డిఎస్సీ నిర్వహించి, నియామకాలు చేపట్టడం జరిగిందని, ధర్మపురి సంస్కృతాంధ్ర కళాశాలను విప్ లక్ష్మణ్ కుమార్ పట్టు పట్టి తిరిగి పునః ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో నిరుద్యోగుల గురించి పాలకులు పట్టించుకోలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 56 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందని, ధర్మపురిలో పునః ప్రారంభించడానికి సాధ్యం కాదు అన్న సంస్కృతాంధ్ర కలశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి కొండ సురేఖ సహకారంతో తిరిగి పునః ప్రారంబించడం జరిగిందని, సుమారు 100 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్ ను ధర్మపురికి మంజూరు చేయడం జరిగిందని అన్నారు.
బీజేపీ నాయకులు వచ్చి తమ అభ్యర్ధిని ఓటు వేయాలని అడిగితే ధర్మపురి మండలం లోని నేరెల్ల లో ఏర్పాటు చేయాలనుకున్న నవోదయ విద్యాలయాన్ని బి జె పి ఎంపి వేరే ప్రాంతానికి తీసుకెళ్లాలని చూసారని, మా ప్రాంతం విద్య పరంగా అభివృద్ధి కావడం మీకు ఇష్టం లేదా అని బీజేపీ నాయకులను పట్టభద్రులు ప్రశ్నించాలని, పార్టీ నాయకులు కార్యకర్తలు కలసి కట్టుగా పనిచేసి కాంగ్రెస్ గెలుపు కొరకు కృషి చేయాలని కోరారు.
ప్రత్యేక పూజలు
అనంతరం రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పట్టభద్రులు,మండల అధ్యక్షులు సంగనబట్ల దినేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి

బౌద్దనగర్ కార్పొరేటర్ కంది శైలజ పర్యటన

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు జగిత్యాల జిల్లా అర్ టి ఏ మెంబర్.

జగిత్యాల పట్టణ ఆవోపా ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం

జగిత్యాల పట్టణ ఆవోపా ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం

భయం వీడితే...జయం మనదే..
.jpg)
మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు ..... కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)