దళిత బంధు నిధులను బడ్జెట్ లోపు విడుదల చేయాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

On
దళిత బంధు నిధులను బడ్జెట్ లోపు విడుదల చేయాలి -  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఎస్సీ వర్గీకరణలో రేవంత్ రెడ్డి పాత్రేమీ లేదు
- షమీమ్ అఖ్తర్ కమిషన్ నివేదికను బహీర్గతం చేయలి
- అన్ని వర్గాలకు న్యాయం చేసేలా వర్గీకరణ చేపట్టాలి
- వర్గీకరణ వంకతో జాబు క్యాలెండర్ అమలును నిలిపివేయవద్దు
- దళిత బంధు సాధన సమితి సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ ఫిబ్రవరి 20:

ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. వర్గీకరణ విషయంలో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని, సుప్రీం కోర్టు తీర్పు వల్ల వర్గీకరణకు బాటలు పడ్డాయని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ అసెంబ్లీలో వర్గీకరణపై తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తు చేశారు.  దళితుల మధ్య పంచాయతీ పెట్టవద్దని, ఎవరికీ అన్యాయం జరగకుండా వర్గీకరణ చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు.  

గురువారం నాడు తన నివాసంలో జరిగిన దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడు మహేష్ కోగిల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. షమీమ్ అఖ్తర్ కమిషన్ నివేదికను బయటపెట్టి, వెంటనే వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

 ఎస్సీ వర్గీకరణ పేరు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మరో మోసం చేశారని, వర్గీకరణకు, ఉద్యోగాల కల్పనకు ముఖ్యమంత్రి లింక్ పెడుతున్నారని అన్నారు. వర్గీకరణ వంకతో జాబు క్యాలెండర్ అమలును నిలిపివేయవద్దని సూచించారు. కోర్టు తీర్పు వచ్చి 6 నెలలు గడిచినా ఆలూలేదు చూలు లేదన్నట్లుగా ఉందని విమర్శించారు.  

రేవంత్ రెడ్డి మాటలు చెబితే నమ్మరని ఢిల్లీ నుంచి ప్రియాంకా గాంధీని తీసుకొచ్చి హామీ ఇప్పించారని, దళిత కుటుంబాలకు రూ 10 లక్షలకు బదులు రూ 12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రికి ప్రభుత్వాన్ని నడపడం చేతకావడం లేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి కుదేలు చేశారని తెలిపారు.  

ఇప్పటికే కేసీఆర్ మంజూరు చేసిన దళిత బంధు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మిగిలిన 18 వేల దళిత కుటుంబాలకు దళిత బంధు డబ్బులను విడుదల చేయాలని సవాలు చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందే ఈ డబ్బులు విడుదల చేయాలని అన్నారు. ఎస్సీలకు బడ్జెట్ లో రూ. 33 వేల కోట్లు కేటాయించి... కేవలం రూ 9800 కోట్లే ఖర్చు చేశారని  ఎండగట్టారు. 
   
రేవంత్ రెడ్డిది మనసున్న ప్రభుత్వం కాదని, మానవత్వం లేదని విమర్శించారు.  కేసీఆర్ ఆలోచన పెద్దగా ఉండేదని, చిన్నవాళ్లపై చూపు ఉండేదని, కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చిన్నదని, చూపు పెద్దవాళ్లపైనే ఉందని అన్నారు. అందుకే ముఖ్యమంత్రి125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పూలదండ కూడా వేయలేదని, అంబేద్కర్ తో పాటు, ఆయన వారసులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు.

అంబేద్కర్ జయంతిలోపు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు మంత్రివర్గం మొత్తం వెళ్లి పూలదండలు వేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వం మూసివేసిన గేట్లను బద్దలుకొట్టి తాము అంబేద్కర్ ను గౌరవించుకుంటామని తేల్చిచెప్పారు.  అంబేద్కర్ ని గౌరవించని ముఖ్యమంత్రి... మన ఆకలిని అర్థం చేసుకుంటారా ? అని ప్రశ్నించారు. అట్టడుగు వర్గాల వారిని వేలు పట్టుకొని ముందుకు నడిపించాలన్నది కేసీఆర్ ఆలోచన అని, పేదలు, అణగారిన వర్గాల కోసం పనిచేయాలని కేసీఆర్ ఎప్పుడూ అంటుంటారని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు ఆత్మబంధువు అంబేద్కర్ అని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైందని, అంబేద్కర్ పై ప్రేమను ప్రదర్శించడానికి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారని వివరించారు. రెండు మూడేళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుందని, దళితులకు మంచి రోజులు వస్తాయని స్పష్టం చేశారు. 

దళితులను ధనవంతులను చేయాలన్న ఉద్ధేశంతో కేసీఆర్ దళిత బంధును ప్రవేశపెట్టారని, ఎన్నికల కోసం కాకుండా... రానున్న తరాల కోసం కేసీఆర్ ఆలోచిస్తారని తెలిపారు. 

మరోవైపు, అట్టడుగు వర్గాలకు సరైన మార్గం చూపాలన్నదే కేసీఆర్ ఆలోచన విధానమని, దళితుల్లో పేదరికాన్ని పారద్రోలడానికి కేసీఆర్ ఆనాడు సంకల్పించారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. ఒక్కో దళిత కుటుంబానికి రూ 10 లక్షల ఇవ్వాలన్న విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని, అంత ధైర్యంగా నిర్ణయం తీసుకున్న సాహసోపేత  నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. దళితుల కోసం రూ 57 వేల కోట్లు ఖర్చు చేయాలని కేసీఆర్ భావించారని, కేసీఆర్ ఆలోచన అమలైతే దళిత కుటుంబాల్లో దరిద్రం ఉంటుందా ? అని అడిగారు.

దళిత బంధును అమలను కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ దళితులను మోసం చేస్తూనే ఉందని విమర్శించారు. దళిత బంధు సాధన సమితి ఉద్యమానికి అండగా ఉన్నందుకు ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాలని ఎమ్మెల్సీ కవితకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ , చిటిమల్ల సమ్మయ్య,  మడికొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు

Tags

More News...

Local News 

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం  నిధులు కేటాయించాలి

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం  నిధులు కేటాయించాలి * పెండింగ్ లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.* ఖాళీగా ఉన్న బోధనా సిబ్బందినీ వెంటనే భర్తీ చేయాలి.* విశ్వవిద్యాలయాల బడ్జెట్ మేరకు బ్లాక్ గ్రాంట్ కేటాయించాలి.* మీడియా సమావేశంలో ఏబీవీపీ నాయకులు సికింద్రాబాద్​, మార్చి 12 ( ప్రజామంటలు): వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ...
Read More...
Local News 

బౌద్దనగర్​ కార్పొరేటర్​ కంది శైలజ పర్యటన

బౌద్దనగర్​ కార్పొరేటర్​ కంది శైలజ పర్యటన సికింద్రాబాద్​ మార్చి 12 (ప్రజామంటలు): సికింద్రాబాద్​ బౌద్ధనగర్​ డివిజన్​లో బుధవారం కార్పొరేటర్​ కంది శైలజ అధికారులతో కలసి పర్యటించారు. ఈసందర్బంగా ఆయా ప్రాంతాల్లోని స్ర్టీట్​ లైట్స్​ వెలుగుతున్నాయా...లేదా...అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట వీధిదీపాలను పెట్టాలని కార్పొరేటర్​ ఆదేశించారు. కొన్ని చోట్ల వెలుతురు తక్కువగా ఉండటంతో అక్కడ కొత్త వీధి దీపాలు ఏర్పాటు చేయనున్నట్లు...
Read More...
Local News 

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు జగిత్యాల జిల్లా అర్ టి ఏ మెంబర్.

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు జగిత్యాల జిల్లా అర్ టి ఏ మెంబర్.    జగిత్యాల మార్చి 12( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో  రవాణా శాఖ కార్యాలయము నిర్మాణమునకు అనువైన ప్రభుత్వ స్థలము కేటాయించగలరని కోరుతూ, కార్యాలయ సిబ్బందికి విధి నిర్వహణలో ఏర్పడుతున్న ఇబ్బందులు తదితర సమస్యల పరిష్కార నిమిత్తం జగిత్యాల జిల్లా కేంద్రంలో  10 ఎకరాలు (ఏ టి ఎస్ ఆటోమేటిక్ టెస్టింగ్ ఫిట్నెస్ స్టేషన్, సైంటిఫిక్ డ్రైవింగ్...
Read More...
Local News 

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం          

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం              జగిత్యాల మార్చి 12( ప్రజా మంటలు)  యశోద  హైటెక్ సిటీ సూపర్ స్పెషాలిటీ   డాక్టర్స్ హరీష్, కీర్తి, చైతన్య లచే సుమారు 250 మందికి పైగా ఉచితంగా వైద్య సేవలు అందించి అవసరమైన వారికి ఉచిత ఫిజియోథెరపీ మరియు రాయితీ లో అవసరమైన   స్కానింగ్లు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు పబ్బ శ్రీనివాస్,...
Read More...
Local News 

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం          

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం                జగిత్యాల మార్చి 12( ప్రజా మంటలు)  ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు పబ్బ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మోటూరి శ్రీనివాస్, కోశాధికారి వూటూరి నవీన్, అదనపు కార్యదర్శి పల్లెర్ల నరేష్    ఎలిమిల్ల సాగర్, కట్కూరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Read More...
Local News 

భయం వీడితే...జయం మనదే..

భయం వీడితే...జయం మనదే.. - టెన్త్​ క్లాస్​ స్టూడెంట్స్​కు సైకాలజిస్ట్ జ్యోతి రాజా సూచన  సికింద్రాబాద్​ మార్చి 12 (ప్రజామంటలు): బన్సీలాల్ పేట్ లోని చాచా నెహ్రూ నగర్ కమ్యూనిటీ హాల్లో రెయిన్ బో ఫౌండేషన్ ఇండియా, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ రెయిన్ బో కమ్యూనిటీ కేర్, లెర్నింగ్ సెంటర్, ఆశ్రిత, బ్లూ ఫౌండేషన్, భవిత ఫౌండేషన్, పీపుల్స్ హెల్పింగ్ చిల్డ్రన్...
Read More...
Local News  State News 

మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి

మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి సీఎం ప్రజావాణి సక్సెస్ రేటు 66 శాతం  సీఎం ప్రజావాణి పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది - రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జీ. చిన్నారెడ్డి- పాల్గొన్న హైడ్రా కమీషనర్ రంగనాధ్, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య  ## ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి లో  "" సిటిజన్ సెంట్రిక్...
Read More...
Local News  State News 

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు .....  కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు .....  కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు (రామ కిష్టయ్య సంగన భట్ల) శివకేశవుల సన్నిధి, భక్తుల పాలిటి పెన్నిధిగా రాష్ట్రంలో పేరెన్నికగన్న హరిహర క్షేత్రమైన ధర్మపురి పట్టణంలో బుధ వారం భక్తి పారవశ్యం పొంగి పొర్లింది. క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ (యోగ, ఉగ్రుణ శ్రీ వేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా,  యోగానంద, ఉగ్ర లక్ష్మీనారసింహ, వేంకటేశ్వర స్వాముల వార్షిక బ్రహ్మోత్సవాలను  పురస్కరించుకుని...
Read More...
Local News 

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు* భీమదేవరపల్లి మార్చి 12 (ప్రజామంటలు) హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండల కేంద్రంలో JSR గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్ర కేంద్రాన్ని బీజేపీ నాయకులు ప్రారంభించడం జరిగింది. వరుసగా నాల్గవ సంవత్సరం ఏర్పాటు చేసిన చలి వేంద్ర కేంద్రాన్ని బీజేపీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బాటసారులు,ప్రజలు,ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు...
Read More...
Local News 

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ. గొల్లపల్లి / మల్యాలమార్చి 11 (ప్రజా మంటలు): మల్యాలలో అస్మా సుల్తానా నిన్న రాత్రి తన ఇంటి కి తాళాలు వేసి వారి బిడ్డ ఇంటికి జగిత్యాల కు వెళ్లి తిరిగి ఈరోజు ఉదయం ఇంటికి వచ్చి చూడగా తన ఇంటి తలుపుల తాళాలు పగలగొట్టి, ఇంట్లోని బీరువాలో గల 5 తులాల బంగారు ఆభరణాలు,...
Read More...
Local News 

శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్​ లో చోరికి యత్నం

శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్​ లో చోరికి యత్నం     అగంతకున్ని పట్టుకొని దేహశుద్ది    * అనంతరం పోలీసులకు అప్పగింత సికింద్రాబాద్​, మార్చి 11 (ప్రజామంటలు):పద్మారావునగర్​ శ్రీసాయిబాబా టెంపుల్​ పక్కనున్న శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం సాయంత్రం ఓ అగంతకుడు చోరికి విఫల యత్నం చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలోనికి ప్రవేశించిన దాదాపు 50 ఏండ్ల వయస్సు కలిగిన ఓ వర్గానికి...
Read More...
Local News 

గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్    సికింద్రాబాద్​, మార్చి 11 ( ప్రజామంటలు):   సంజీవరెడ్డి నగర్ పరిధిలోని గురుమూర్తి నగర్‌లో గల వినాయక స్వామి ఆలయంలో శనివారం రాత్రి దుండగులు పంచలోహ విగ్రహాలను దొంగిలించిన విషయం విదితమే. ఈనేపద్యంలో  ఘటనపై సమాచారం అందుకున్న సనత్‌నగర్ కాంగ్రెస్​ ఇన్‌చార్జ్ డా. కోట నీలిమ వెంటనే స్పందించారు. చోరీకి గురైన విగ్రహాలను త్వరగా గుర్తించి, దొంగలను...
Read More...