రైతులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు యూరియా కొరత లేకుండా చూస్తాం - ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
బోనస్ డబ్బులు కూడా సాధ్యమైనంత త్వరగా రైతులకు అందేలా చర్యలు తీసుకుంటాం
ధర్మపురి ఫిబ్రవరి 20:
ధర్మపురి మండలం జైన గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని గురువారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండల నాయకులతో కలిసి సందర్శించి,రైతులతో మాట్లాడారు.
*ధర్మపురి మండలం జైన గ్రామంలో యూరియా నిల్వలు సరిపడ లేక పంట సాగుకు కొంత ఇబ్బందికి జరుగుతుందని రైతులు నా దృష్టికి తీసుకురావడం జరిగిందని,వెంటనే సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ,మరియు డైరెక్టర్,జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ధర్మపురి నియోజక వర్గంలోని 12 సహకార సంఘాలకు సరిపడ యూరియాను పంపించాలని కోరడం జరిగిందని,వారు కూడా వెంటనే స్పందించి ఈ రోజు రాత్రి వరకు యూరియాను పంపించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని,రైతులు ఎలాంటి అందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు.
గత ఏడాది కంటే ఈ సారి కొంత రైతులు ఎక్కువ యూరియాను వాడటం జరుగుతుందని,ఇతర పంటల వైపు కూడా రైతులు మొగ్గు చూపడంతో కొత్త యూరియా వాడకం ఎక్కువగా అవ్వడం జరిగిందని,అయినప్పటికీ రైతులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా అధికారులతో మాట్లాడి యూరియాను పంపిస్తామని,వడ్ల కొనుగోలు కూడా ఎక్కడ కట్టింగ్ లేకుండా పూర్తి చేయడం జరిగిందని,కానీ గత పాలకులు మాత్రం రైతులను మిలర్లతో మాట్లాడుకోండి అని వ్యగంగా సమాధానం చెప్పడం జరిగిందని,కానీ మేము అలా కాకుండా సమస్య ఉంది అని తెలిసిన వెంటనే సొసైటి వద్దకు వచ్చి రైతులతో మాట్లాడటం జరిగిందని తెలిపారు.
అదే విధంగా బొనస్ డబ్బులు కూడా కొంత మంది రైతులకు రాలేదు అని చెప్పడం జరిగిందని,రైతులకు పూర్తిగా మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని,బోనస్ కూడా సాధ్యమంత త్వరలో రైతులకు అందేలా చూస్తామని ఈ సందర్భంగా తెలిపారు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రామన్న జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం

జిల్లా కలెక్టరు ని కలిసిన జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నూతన కార్యవర్గం

ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ డిస్టిక్ లెవెల్ పోటీల ఆహ్వాన పత్రం పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్లకు అందజేత

విద్యార్థినులకు స్కూటీలు ఏవి ? బి అర్ ఎస్ నాయకుల నిలదీత

టీడీఎఫ్ ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్‌రెడ్డికి సీఎస్ఆర్ అవార్డు

గొల్లపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ లో స్త్రీల భద్రతపై అవగాహన

గొల్లపల్లి మండల ప్రాథమిక ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసినకలెక్టర్ బి.సత్య ప్రసాద్

చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేలా చర్యలు చేపట్టాలి

బీసీ రిజర్వేషన్ బిల్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంబరాలు

పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
