అమాయకపు రైతులకు సబ్సిడీ క్రింద ట్రాక్టర్లు ఇప్పిస్తామని మోసం చేసి లక్షలు కాజేసిన ముఠా అరెస్ట్ - జగిత్యాల డిఎస్పి రఘు చందర్
గొల్లపల్లి( పెగడపల్లి) ఫిబ్రవరి17 (ప్రజా మంటలు):
అమాయకపు రైతులకు సబ్సిడీ క్రింద ట్రాక్టర్లు ఇప్పిస్తామని మోసం చేసి లక్షలు కాజేసిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
పెగడపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాలకు చెందిన చంద్రమౌళి బతికేపల్లి గ్రామానికి చెందిన మల్లేశం చింతకిందు కిషోర్ అనే వ్యక్తులు ముగ్గురు కలిసి NAPS అనే సంస్థ ద్వారా, రైతులకు 40% పర్సెంట్ సబ్సిడీ క్రింద ట్రాక్టర్లు ఇప్పిస్తామని బతికేపల్లి నందగిరి గ్రామంలోని ఆరుగురు అమాయకపు రైతులను నమ్మించి వారి వద్ద నుంచి దాదాపు 36 లక్షల రూపాయలను వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అందులో నుండి దాదాపు 10 లక్షల వరకు డౌన్ పేమెంట్ గంగాధర లోని శ్రీ వేంకట సాయి ఎంటర్ప్రైజెస్ జాన్ డియర్ ట్రాక్టర్ షోరూం యాజమాన్యం వారి ప్రోద్బలంతో వారికి ట్రాక్టర్లు ఇప్పించి, అమాయకపు రైతులకు తెలియకుండా సబ్సిడీ కోసమని వారి సంతకాలు తీసుకొని ఈఎంఐ కట్టుకునే విధంగా పై ముగ్గురు కలిసి పథకం వేశారు.
మిగిలిన సుమారు 26 లక్షల రూపాయలను తలో కొంత మొత్తంలో తమ సొంత అవసరాలకు వాడుకొని రైతులను మోసం చేసిన మన్నె మల్లేశం చింతకింది కిషోర్ కామెర చంద్రమౌళి అను వ్యక్తులను పెగడపల్లి పోలీసులు సీఐ మల్యాల నీలం రవి ఎస్సై రవికిరణ్ లు సోమవారము పట్టుకొని జగిత్యాల కోర్టు ముందు ప్రవేశపెత్తారు. అదే గ్రామం లోని కామెర చంద్రమౌళి కి చెందిన NAPS అనే ప్రైవేట్ సంస్థపై మంచిర్యాల లో చాలామంది రైతులను మోసం చేసినందుకు గత సంవత్సరం నవంబర్ నెలలో కూడా మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లు తెలిసిందని అదేవిధంగా పెగడపల్లి మండల ప్రాంతంలో కూడా పైన తెలిపిన విధంగా ఈఎంఐ క్రింద ఆరుగురు అమాయకపు రైతులకు ట్రాక్టర్లు ఇప్పించినట్లు మరియు వారిని మోసగించుటలో సహకరించిన శ్రీ వేంకట సాయి ఎంటర్ప్రైజెస్ జాన్ డియర్ ట్రాక్టర్ షోరూం యాజమాన్యం వారి పై కూడా దర్యాప్తు జరుపుతున్నట్టు జగిత్యాల డిఎస్పి శ్రీ రఘు చందర్ సిఐ నీలం రవి, ఎస్ఐ రవికిరణ్, తెలిపారు
More News...
<%- node_title %>
<%- node_title %>
అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి

బౌద్దనగర్ కార్పొరేటర్ కంది శైలజ పర్యటన

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు జగిత్యాల జిల్లా అర్ టి ఏ మెంబర్.

జగిత్యాల పట్టణ ఆవోపా ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం

జగిత్యాల పట్టణ ఆవోపా ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం

భయం వీడితే...జయం మనదే..
.jpg)
మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు ..... కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)