స్వామి వివేకానంద హైదరాబాద్ పర్యటన సనాతన ధర్మ చరిత్రలో మైలురాయి - గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
వివేకానంద దివస్ యువ సమ్మేళనంలో గవర్నర్
సికింద్రాబాద్ ఫిబ్రవరి 13 (ప్రజామంటలు):
స్వామి వివేకానంద హైదరాబాద్ పర్యటన సనాతన ధర్మ చరిత్రలో, రామకృష్ణ మిషన్ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని తెలంగాణ రాష్ర్ట గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చెప్పారు. స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి 13న తన జీవితంలోనే తొలిసారిగా ఓ బహిరంగ సభను ఉద్దేశించి సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ ప్రాంగణంలో ప్రసంగించారని ఆయన గుర్తు చేశారు. మహబూబ్ కాలేజ్ లో వివేకానంద దివస్ సందర్భంగా గురువారం మహబూబ్ కాలేజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ, రామకృష్ణ మఠం సంయుక్తంగా నిర్వహించిన యూత్ కన్వెన్షన్ లో గవర్నర్ ప్రసంగించారు. అమెరికా లోని చికాగోలో జరిగిన విశ్వ మత సభలో స్వామి వివేకానంద ప్రసంగానికి నాంది మహబూబ్ కాలేజీలో చేసిన ప్రసంగమని గవర్నర్ చెప్పారు. చికాగో ప్రసంగంలో వేదాలు, పురాణాలు, అనుష్టాన వేదాంతం గురించి స్వామి వివేకానంద చెప్పారని వర్మ తెలిపారు. ఇనుప కండలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగిన యువత భారత్ ను విశ్వ గురువుగా చేయగలరని గవర్నర్ ధీమా వ్యక్తం చేశారు. నేటి యువత.. స్వామి వివేకానంద చూపిన బాటలో నడుస్తూ, ఆయన సైనికులుగా మారి దేశాన్ని ప్రేమిస్తూ ఆయన కలలను సాకారం చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద మాట్లాడుతూ... స్వామి వివేకానంద బోధనలు చదివితే ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తి వస్తుందని తెలిపారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత నిర్భయత్వం, త్యాగగుణం అలవర్చుకోవాలని ఆయన సూచించారు. భారత్ ను విశ్వగురువు చేయాలన్న స్వామి వివేకానంద కలలను యువత సాకారం చేయాలని స్వామి బోధమయానంద పిలుపునిచ్చారు. బోల్టన్ స్కూల్ చైర్మన్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ పాట్నీ సెంటర్ కు వివేకానంద పేరు పెట్టాలని, చౌరస్తాలో వివేకానంద విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సైనిక్ పురి భవన్స్ విద్యార్థులు నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ అందరిని అలరించాయి. మహబూబ్ కాలేజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పిఎల్ శ్రీనివాస్, సొసైటీ సభ్యులు, రామకృష్ణ మఠం స్వాములు, వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు
