జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత అన్నారు.
డిఫాల్ట్ డబ్బులను మార్చి 31 లోగా మిల్లర్లు చెల్లించాలి
అదనపు కలెక్టర్ బి లత
జగిత్యాల ఫిబ్రవరి 13 (ప్రజా మంటలు)
డిఫాల్ట్ డబ్బులను మార్చి 31లోగా మిల్లర్లు చెల్లించాలి..
దించుకున్న ధాన్యానికి 10% బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాల్సిందనీ
ఈ అవకాశాన్ని మిల్లర్లు సద్వినియోగం చేసుకోవాలి..
డిఫాల్ట్ డబ్బులను మార్చి 31 లోగా మిల్లర్లు చెల్లించాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ డిఎస్ లతా ఆదేశించారు. ఈ నిబంధనను మిల్లర్లు కచ్చితంగా పాటించాల్సిందేనని సూచించారు.
గురువారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు, డిఫాల్ట్ అయిన మిల్లర్లతో జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత సమీక్ష నిర్వహించారు. 2019-2020 నుండి 2023-2024 సంవత్సరంలో డిఫాల్ట్ అయిన మిల్లర్లు 25 % తో కలిపి వారికి మార్చి 31 తేదీలోగా డిఫాల్ట్ అయిన డబ్బులను ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశించారు. డబ్బులు చెల్లించే విషయంలో మిల్లర్లు నిర్లక్ష్యం వహించరాదని, వెంటనే ఆ డబ్బులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఖరీఫ్, 2024-25 సంవత్సరం దించుకున్న ధాన్యానికి సంబంధించి 10% బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలని మిల్లర్లకు సూచించారు. డిఫాల్ట్ అయిన మిల్లర్లకు ఇదే చివరి అవకాశం అని, స్టేట్ పుల్ బియ్యం పెట్టుకునేందుకు చివరి అవకాశం ప్రభుత్వం ఇచ్చిందని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని మిల్లర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలను ఎప్పటికప్పుడు పాటించాలని, నిబంధన పాటించని యెడల చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మిల్లర్లు వ్యవహరించాలని సూచించారు ఈ సమావేశములో డిస్టిక్ మేనేజర్ సివిల్ సప్లై డిఎస్ఓ, సివిల్ సప్లయ్ అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు
