ఎన్ఐటి లో ఆల్ ఇండియా ఇంటర్ నిట్ టోర్నమెంట్-2025
ఎన్ఐటి లో ఆల్ ఇండియా ఇంటర్ నిట్ టోర్నమెంట్-2025
హన్మకొండ ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు) :
ఆల్ ఇండియా ఇంటర్ నిట్ టోర్నమెంట్ 2025 ను జిల్లాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్ వరంగల్) ఆతిథ్యమివ్వనున్నట్లు నిట్ వర్గాలు ప్రకటించాయి. ఫిబ్రవరి 21 నుండి 23 వరకు జరిగే కీలక క్రీడోత్సవానికి దేశవ్యాప్తంగా ఉన్న 22 నిట్ ల నుండి ప్రతిభావంతులైన క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొననున్నట్లు , ఈ టోర్నమెంట్ కి సంబంధించిన బ్రోచర్‌ను నిట్ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ డి. శ్రీనివాసచార్య (డీన్ స్టూడెంట్ వెల్ఫేర్), ప్రొఫెసర్ పి. రవి కుమార్ (హెడ్ - స్పోర్ట్స్ సెంటర్), ప్రొఫెసర్ డి.వి.ఎస్.ఎస్. శివ శర్మ (బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మెంబర్), డాక్టర్ పి. ప్రసాంత్ , డా డి. హరి హాజరయ్యారు. ఈ టోర్నమెంట్లో 22 నిట్ ల నుండి 450 మంది పురుషులు, 350 మంది మహిళా క్రీడాకారులు పాల్గొననున్నారు. పురుషుల మరియు మహిళల వాలీబాల్, యోగ, హ్యాండ్‌బాల్ విభాగాలలో పోటీలు నిర్వహించబడతాయని, ఈ టోర్నమెంట్ సజావుగా సాగేందుకు 60 మంది అధికారులతో పాటు 30 మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి అధికారులు నియమించబడ్డట్లు తెలిపారు. ఈ పోటీల నిర్వహణకు ప్రత్యేక పరిశీలకుడు డా ఎస్. బాబు (నిట్ పూడుచ్చేరి)ను టోర్నమెంట్ న్యూట్రల్ ఆబ్జర్వర్‌గా నియమించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రతినిధులు అతర్వ దేశ్‌పాండే (స్పోర్ట్స్ సెక్రటరీ), శుభంగి ఠాకూర్ (జాయింట్ సెక్రటరీ – స్పోర్ట్స్), కోర్ టీమ్ సభ్యులు హర్షిత సజ్జన్, అక్షత్ గుప్తా, భవిక్ జైన్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు
