తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులకు "రిటర్న్ గిఫ్ట్" సీనియర్ సిటిజన్ యాక్ట్*

On
తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులకు

భీమదేవరపల్లి నవంబర్ 4 (ప్రజామంటలు) :

IMG-20241104-WA0616ల్లిదండ్రులను వృద్ధాప్యంలో పట్టించుకోని కొడుకులకు సీనియర్ సిటిజన్ యాక్ట్ రిటర్న్ గిఫ్టు లాంటిది. ఆధునిక సమాజంలో నేటి యువత మానవ సంబంధాలు మంటగలుపుతున్న నేపథ్యంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు సీనియర్ సిటిజెన్ యాక్ట్ ఒక వరం. వివరాల్లోకి వెళితే భీమదేవరపల్లి మండలంలోని ముస్తఫాపూర్ గ్రామానికి చెందిన మద్దెల రాజ కొమురయ్య తన ఒక్కగానొక్క కొడుకు రవికి 4.12 ఎకరాల భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించాడు. కొంతకాలం తర్వాత తండ్రి బాగోగులు చూడడం మానేసి, మానసికంగా వేధించడం, చేయి చేసుకోవడంతో రాజ కొమురయ్య కలత చెంది ఓ రైస్ మిల్లులో వాచ్మెన్ గా పనిచేస్తూ కాలం వెల్లదీస్తున్నాడు. సీనియర్ సిటిజన్ ఆక్ట్ ద్వారా స్థానిక తాసిల్దార్ కు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా భీమదేవరపల్లి తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, విచారణ అనంతరం గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రద్దుచేసి సంబంధిత ధ్రువపత్రాలను తండ్రి రాజకొమురయ్యకు అప్పగించినట్లు తెలిపారు. తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు ఎవరైనా సీనియర్ సిటిజన్ యాక్ట్ ను ఉపయోగించుకోవాలని సూచించారు.

Tags