ప్రతి ఒక్కరు నవంబరు 06 లోపు తమ ఓటు నమోదు చేసుకోవాలి. - అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి.
సిద్దిపేట లో ఉచిత ఓటరు నమోదు కార్యాలయం ప్రారంభం.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
సిద్దిపేట అక్టోబర్ 24 (ప్రజా మంటలు) :
రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే ఉద్యోగ నిరుద్యోగ సమస్యలపై మండలిలో గళమెత్తుతానని పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డా.వి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
గురువారం సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఉచిత ఓటరు నమోదు కార్యాలయం ను ప్రారంభించారు.అనంతరం పలువురు పట్టభద్రులను కలసి రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు పలకాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....
ప్రతి ఒక్క పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.
2021 నాటికి లేదా అంతకు ముందు పట్టభద్రులై ఉన్నవారు వచ్చే నెల నవంబర్ 6 వరకు పట్టభద్రులు ఓటరుగా ఎన్రోల్ చేయించుకోవాలని పిలుపునిచ్చారు.
ఓటరు నమోదు సులభతరం చేసేందుకు ఇప్పటికే మిస్డ్ కాల్ క్యాంపియన్ ప్రారంభించినట్టు వెల్లడించారు.. ప్రతి నియోజకవర్గ పరిధిలో తమ ప్రతినిధులు కేంద్రాలు ఏర్పాటు చేసి అందుబాటులో ఉంటారని, ఓటర్ గా ఎన్రోల్ చేసుకోవాలనుకునే వారు అప్లికేషన్ తో పాటు వారి ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, డిగ్రీ సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులు తమ ప్రతినిధులకు అందజేస్తే వారే ఆన్లైన్ లో ఎన్రోల్ చేసి, సర్టిఫికెట్లు సబ్మిట్ చేస్తారని నరేందర్ రెడ్డి తెలిపారు.
ఈ అవకాశాన్ని పట్టభద్రులు అందరూ వినియోగించుకోవాలని కోరారు.కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో లక్షలాదిమంది పట్టభద్రులు ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో వరకు 1.97 లక్షల మంది మాత్రమే ఓటర్లుగా తమ పేరును నమోదు చేయించుకున్నారని అన్నారు.
గత ఎన్నికల్లో 1.07 లక్షల మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు...అదే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదై, మెజారిటీ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుంటారని అన్నారు.గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు రాజకీయాలకే సమయం కేటాయించారు తప్ప నిరుద్యోగులు గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. నిరుద్యోగులకు అండగా నిలిచి ..ప్రభుత్వానికి -పట్టభద్రులకు వారధిగా నిలిచి వారి సమస్యలు పరిష్కరించేందుకుకృషి చేస్తానని వెల్లడించారు.