ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. - డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్.

On
ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. - డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

హైదరాబాద్ 16 జూలై (ప్రజా మంటలు) : 

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో పాల్గొనేందుకు పోలీసు అధికారులు హైదరాబాద్‌కు వచ్చారు.

డిజిపి కార్యాలయంలో మంగళవారం నాడు వారిని ఉద్దేశించి డీజీపీ మాట్లాడారు.

ఆయా జిల్లాలు, కమిషనరేట్‌లకు పంపిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని డీజీపీ జితేందర్ అధికారులను ఆదేశించారు, ఈ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం వల్ల ప్రజలు సంతృప్తి చెందుతారని చెప్పారు. 

పోలీస్ స్టేషన్లలో వచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసులు నమోదు చేయాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని డిజిపి అధికారులను ఆదేశించారు.

పోలీసు కమీషనర్లు, ఎస్పీలు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీల చేయాలని ఆదేశించారు.

తాను కూడా త్వరలోనే జిల్లాల వారీగా తనిఖీల చేపడుతానని వెల్లడించారు.

తనతోపాటు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా వివిధ జిల్లాల్లో తనిఖీలు చేపడతారని తెలియజేశారు.

హిస్టరీ షీట్‌ల సమీక్షించాలని, ఆయుధాల లైసెన్స్‌ల జారీపై జాగ్రత్త వహించాలని, శాంతి భద్రతలు మెరుగైన నిర్వాహణ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని డిజిపి జితేందర్ ఆదేశాలు జారీ చేశారు.

‘నేను సైతం’ కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించడంతోపాటు రోడ్డు భద్రత ప్రాముఖ్యతను ఆయన వివరించారు.

స్టేషన్ హౌస్ ఆఫీసర్ల పనితీరును అంచనా వేసేందుకు నేర సమీక్ష సమావేశాలు నిర్వహించాలని డిజిపి సూచించారు.

గౌరవనీయులైన ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా, రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన డిజిపి, అవసరమైతే ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని ప్రతిపాదించారు. 

 ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ అదనపు డిజిపి మహేశ్ ఎం భగవత్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కె. శ్రీనివాస్ రెడ్డి, అదనపు డిజిపిలు శిఖా గోయెల్, అభిలాష బిష్త్, వీవీ శ్రీనివాస్ రావు, విజయ్ కుమార్, స్టీఫెన్ రవీంద్ర, పోలీస్ కమిషనర్లు అవినాష్ మహంతి (సైబరాబాద్), జి. సుధీర్ బాబు (రాచకొండ), ఐజిపిలు ఎస్. చంద్రశేఖర్ రెడ్డి (మల్టీ జోన్-1), వి. సత్యనారాయణ (మల్టీ జోన్ -II), ఎం రమేష్, కె. రమేష్ నాయుడు, నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఇతర పోలీసు కమిషనర్‌లు, జిల్లా ఎస్పీలు సహా కీలక అధికారులు పాల్గొన్నారు.

Tags