పట్టభద్రుల అభ్యర్థితో "ఎమ్మెల్యే బిజి - బిజీ"  ప్రజలను పట్టించుకోని ప్రజా "ప్రతినిధి" రమ్మన్న చోటుకు పోతే ఎవరూ లేరు ఎమ్మెల్యే ఎక్కడ అంటే.... గుడిలో....

On
పట్టభద్రుల అభ్యర్థితో

గుడికి వెళ్తే.... ఇంటికి రమ్మని పిలుపు
ఇంటికి వస్తే... గంటల సేపు నిరీక్షణ 
ప్రజలను పట్టించు కోకుండా "కారెక్కిన ఎమ్మెల్యే"
మళ్ళీ పలాన కాడికి రావాలని సూచించిన ఎమ్మెల్యే
నిరీక్షించి విసిగి "వేసారిన ప్రజలు"
ఆటోల కిరాయి లేక "తిప్పలు పడ్డ తల్లులు"

ఇదేమి పద్ధతి అంటూ "ముక్కున వెలేసుకున్న ప్రజలు", పార్టీ కార్యకర్తలు, అభిమానులు

"పట్టభద్రులు ఓటేసేనా.... అభ్యర్థి గెలిచేనా" ...? అంటూ సొంత పార్టీ కార్యకర్తల గుస గుసలు

(చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్)
(ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు)IMG-20250215-WA0330

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ ఎమ్మెల్యే.... పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థితో బిజి - బిజీగా ఉన్నారు పాపం.

 శుక్రవారం తనను కలవడానికి వచ్చిన ప్రజలను, మహిళలను, దూర ప్రాంతం నుండి వచ్చిన వృద్ధులను సైతం ఆ ఎమ్మెల్యే పట్టించుకోకుండా వెళ్లి పోయాడని ఆరోపణలు.

 నియోజక వర్గంలోని ఆశావాహులు ఎమ్మెల్యే ను కలిసి తమ బాధలు చెప్పుకోవాలని, వినతి పత్రాలు అందించాలని, తగిన న్యాయం, తగు లబ్ధి పొందాలని, వారి - వారి సమస్యలు పరిష్కరించు కోవాలని కలలు గన్నారు. ఎన్నెన్నో ఆశలతో ఉదయత్ పూర్వమే నిద్రలేచి, చలికి గజ - గజ వణుకుతూ... ఎన్నెన్నో వ్యవ ప్రయాసలకు ఓర్చుకొని పొద్దు పొడిసే లోపు సదరు ఎమ్మెల్యేను కలువడానికి వచ్చారు.
కానీ.... ఆ ఎమ్మెల్యే మాత్రం ప్రజలను కలువకుండానే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం పరుగు - పరుగున వెళ్ళిపోయారు. పలాన సంఘం కాడికి రండి అక్కడ కలుద్దాం అంటూ ఎమ్మెల్యే తన కారెక్కి వెళ్లి పోయారు. 

సదరు ప్రజలు ఎలాగో తిప్పలు పడుతూ.... అవసరం మనది కదా అంటూ... గులుగుకుంటూ ఆయన సూచించిన సంఘం వద్దకు హుటాహుటిన వెళ్లారు.
అక్కడ సదరు ఎమ్మెల్యే లేక పోవడంతో.... ఆశ్చర్య పోయారు. అరే.... మా ఎమ్మెల్యే ఏరి ఇక్కడికి రమ్మన్నారు కదా.... అని ఆరా తీయగా గుడికి వెళ్లారని తెలిసింది.
తీరా గుడి వద్దకు వెళ్లి గుడి ఎదుట భిక్షాటన లాగా ఎమ్మెల్యే కొరకు పడిగాపులు కాశారు ఆ ఆశావాహులు.
గుడి దర్శనం చేసుకొని వచ్చిన ఆ ఎమ్మెల్యే తాను చెప్పిన సంఘం వద్ద తన పార్టీ కార్యకర్తలు ఎవరూ లేరని తెలుసుకొని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థితో కారెక్కి తన ఇంటి ముఖం పట్టారు.

అయ్యా .... మీ కొరకే వచ్చాం.... అని ప్రజలు సదరు ఎమ్మెల్యే ను వేడుకోగా.... ఇంటికి రండి అక్కడ కలిసి మాట్లాడుదాం అంటూ... కారెక్కి ఇంటికి వెళ్లి పోయారు. 

ఇక గత్యంతరం లేక ఆ ప్రజలంతా ఎమ్మెల్యే గారి ఇంటి దారి పట్టి ఎలాగో... తిప్పలు పడుతూ ఎమ్మెల్యే నివాసానికి చేరుకొన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థితో  లోపల ఉన్న ఎమ్మెల్యే కొరకు అక్కడ గంటల తరబడి వేచి ఉన్నారు ఆశావాహులు.

ఎమ్మెల్సీ అభ్యర్థితో కాసేపు ముచ్చటించి, తనకి కావలసిన వారిని మాత్రమే లోపలికి పిలిపించుకొని మాట్లాడి తేనీటి విందు కూడా ముగించుకొని సదరు ఎమ్మెల్యే.... కారెక్కి వెళ్లి పోసాగారు.....
మళ్ళీ ప్రజలంతా... తన పార్టీ కార్యకర్తలు సైతం ఎమ్మెల్యే కారు వద్దకు వెళ్లి అయ్యా.... మీ కొరకే కదా ఇంత సేపటి నుండి వేచి చూస్తున్నాము... అక్కడికి అంటే అక్కడికి వచ్చాం..., అక్కడ మీరు లేకపోవడంతో గుడి కాడ ఉన్నారంటే... గుడి ముందు కాపు కాశాం.... మళ్ళీ ఇంటికి రమ్మని అంటే ఇంటికి వచ్చి గంటలు అయిపాయే... అని ఎమ్మెల్యేతో అనబోయే సరికే.... ఆయన కారెక్కి వెళ్తూ....  అదే.... పలాన సంఘం కాడికి రండీ అంటూ ఎమ్మెల్యే మళ్ళీ కారెక్కి వెళ్ళిపోయారు. 
ముచ్చటగా మూడు సార్లు ఎమ్మెల్యే మాటలు విని విసిగి వేసారిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే వైఖరిపై మండి పడుతూ పలు ఆరోపణలు చేస్తూ.... అక్కడి నుండి కొందరు విసుగుతో వెళ్ళిపోయారు. గంత్యంతరం లేక ఇంకొందరు ఎమ్మెల్యే చెప్పిన సంఘం కాడికి వెళ్లారు. మరికొందరు సంఘం కాడికి వెళ్ళడానికి వాహనాలు లేక, ఆటోలకు చార్జీలకు డబ్బులు లేక తిప్పలు పడ్డారు.

ఇదంతా గమనించిన పార్టీ కార్యకర్తలు సైతం ఎమ్మెల్యే ప్రవర్తన పట్ల అసంతృప్తి వెళ్లగక్కారు.

ఏది ఏమైనా ఎమ్మెల్యే వైఖరి, ఆయన ప్రవర్తన ఇలాగే ఉంటే చాలా కష్టం అని అక్కడ ఉన్న ప్రజలంతా, పార్టీ కార్యకర్తలతో సహా ముక్కున వేలేసుకున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో "పట్టభద్రులు ఓటేసేనా....? అభ్యర్థి గెలిచేనా" ...?? అంటూ సొంత పార్టీ కార్యకర్తలే గుస గుసలాడారు.

Tags

More News...

Local News 

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం  నిధులు కేటాయించాలి

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం  నిధులు కేటాయించాలి * పెండింగ్ లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.* ఖాళీగా ఉన్న బోధనా సిబ్బందినీ వెంటనే భర్తీ చేయాలి.* విశ్వవిద్యాలయాల బడ్జెట్ మేరకు బ్లాక్ గ్రాంట్ కేటాయించాలి.* మీడియా సమావేశంలో ఏబీవీపీ నాయకులు సికింద్రాబాద్​, మార్చి 12 ( ప్రజామంటలు): వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ...
Read More...
Local News 

బౌద్దనగర్​ కార్పొరేటర్​ కంది శైలజ పర్యటన

బౌద్దనగర్​ కార్పొరేటర్​ కంది శైలజ పర్యటన సికింద్రాబాద్​ మార్చి 12 (ప్రజామంటలు): సికింద్రాబాద్​ బౌద్ధనగర్​ డివిజన్​లో బుధవారం కార్పొరేటర్​ కంది శైలజ అధికారులతో కలసి పర్యటించారు. ఈసందర్బంగా ఆయా ప్రాంతాల్లోని స్ర్టీట్​ లైట్స్​ వెలుగుతున్నాయా...లేదా...అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట వీధిదీపాలను పెట్టాలని కార్పొరేటర్​ ఆదేశించారు. కొన్ని చోట్ల వెలుతురు తక్కువగా ఉండటంతో అక్కడ కొత్త వీధి దీపాలు ఏర్పాటు చేయనున్నట్లు...
Read More...
Local News 

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు జగిత్యాల జిల్లా అర్ టి ఏ మెంబర్.

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు జగిత్యాల జిల్లా అర్ టి ఏ మెంబర్.    జగిత్యాల మార్చి 12( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో  రవాణా శాఖ కార్యాలయము నిర్మాణమునకు అనువైన ప్రభుత్వ స్థలము కేటాయించగలరని కోరుతూ, కార్యాలయ సిబ్బందికి విధి నిర్వహణలో ఏర్పడుతున్న ఇబ్బందులు తదితర సమస్యల పరిష్కార నిమిత్తం జగిత్యాల జిల్లా కేంద్రంలో  10 ఎకరాలు (ఏ టి ఎస్ ఆటోమేటిక్ టెస్టింగ్ ఫిట్నెస్ స్టేషన్, సైంటిఫిక్ డ్రైవింగ్...
Read More...
Local News 

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం          

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం              జగిత్యాల మార్చి 12( ప్రజా మంటలు)  యశోద  హైటెక్ సిటీ సూపర్ స్పెషాలిటీ   డాక్టర్స్ హరీష్, కీర్తి, చైతన్య లచే సుమారు 250 మందికి పైగా ఉచితంగా వైద్య సేవలు అందించి అవసరమైన వారికి ఉచిత ఫిజియోథెరపీ మరియు రాయితీ లో అవసరమైన   స్కానింగ్లు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు పబ్బ శ్రీనివాస్,...
Read More...
Local News 

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం          

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం                జగిత్యాల మార్చి 12( ప్రజా మంటలు)  ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు పబ్బ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మోటూరి శ్రీనివాస్, కోశాధికారి వూటూరి నవీన్, అదనపు కార్యదర్శి పల్లెర్ల నరేష్    ఎలిమిల్ల సాగర్, కట్కూరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Read More...
Local News 

భయం వీడితే...జయం మనదే..

భయం వీడితే...జయం మనదే.. - టెన్త్​ క్లాస్​ స్టూడెంట్స్​కు సైకాలజిస్ట్ జ్యోతి రాజా సూచన  సికింద్రాబాద్​ మార్చి 12 (ప్రజామంటలు): బన్సీలాల్ పేట్ లోని చాచా నెహ్రూ నగర్ కమ్యూనిటీ హాల్లో రెయిన్ బో ఫౌండేషన్ ఇండియా, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ రెయిన్ బో కమ్యూనిటీ కేర్, లెర్నింగ్ సెంటర్, ఆశ్రిత, బ్లూ ఫౌండేషన్, భవిత ఫౌండేషన్, పీపుల్స్ హెల్పింగ్ చిల్డ్రన్...
Read More...
Local News  State News 

మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి

మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి సీఎం ప్రజావాణి సక్సెస్ రేటు 66 శాతం  సీఎం ప్రజావాణి పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది - రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జీ. చిన్నారెడ్డి- పాల్గొన్న హైడ్రా కమీషనర్ రంగనాధ్, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య  ## ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి లో  "" సిటిజన్ సెంట్రిక్...
Read More...
Local News  State News 

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు .....  కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు .....  కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు (రామ కిష్టయ్య సంగన భట్ల) శివకేశవుల సన్నిధి, భక్తుల పాలిటి పెన్నిధిగా రాష్ట్రంలో పేరెన్నికగన్న హరిహర క్షేత్రమైన ధర్మపురి పట్టణంలో బుధ వారం భక్తి పారవశ్యం పొంగి పొర్లింది. క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ (యోగ, ఉగ్రుణ శ్రీ వేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా,  యోగానంద, ఉగ్ర లక్ష్మీనారసింహ, వేంకటేశ్వర స్వాముల వార్షిక బ్రహ్మోత్సవాలను  పురస్కరించుకుని...
Read More...
Local News 

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు* భీమదేవరపల్లి మార్చి 12 (ప్రజామంటలు) హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండల కేంద్రంలో JSR గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్ర కేంద్రాన్ని బీజేపీ నాయకులు ప్రారంభించడం జరిగింది. వరుసగా నాల్గవ సంవత్సరం ఏర్పాటు చేసిన చలి వేంద్ర కేంద్రాన్ని బీజేపీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బాటసారులు,ప్రజలు,ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు...
Read More...
Local News 

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ. గొల్లపల్లి / మల్యాలమార్చి 11 (ప్రజా మంటలు): మల్యాలలో అస్మా సుల్తానా నిన్న రాత్రి తన ఇంటి కి తాళాలు వేసి వారి బిడ్డ ఇంటికి జగిత్యాల కు వెళ్లి తిరిగి ఈరోజు ఉదయం ఇంటికి వచ్చి చూడగా తన ఇంటి తలుపుల తాళాలు పగలగొట్టి, ఇంట్లోని బీరువాలో గల 5 తులాల బంగారు ఆభరణాలు,...
Read More...
Local News 

శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్​ లో చోరికి యత్నం

శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్​ లో చోరికి యత్నం     అగంతకున్ని పట్టుకొని దేహశుద్ది    * అనంతరం పోలీసులకు అప్పగింత సికింద్రాబాద్​, మార్చి 11 (ప్రజామంటలు):పద్మారావునగర్​ శ్రీసాయిబాబా టెంపుల్​ పక్కనున్న శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం సాయంత్రం ఓ అగంతకుడు చోరికి విఫల యత్నం చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలోనికి ప్రవేశించిన దాదాపు 50 ఏండ్ల వయస్సు కలిగిన ఓ వర్గానికి...
Read More...
Local News 

గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్    సికింద్రాబాద్​, మార్చి 11 ( ప్రజామంటలు):   సంజీవరెడ్డి నగర్ పరిధిలోని గురుమూర్తి నగర్‌లో గల వినాయక స్వామి ఆలయంలో శనివారం రాత్రి దుండగులు పంచలోహ విగ్రహాలను దొంగిలించిన విషయం విదితమే. ఈనేపద్యంలో  ఘటనపై సమాచారం అందుకున్న సనత్‌నగర్ కాంగ్రెస్​ ఇన్‌చార్జ్ డా. కోట నీలిమ వెంటనే స్పందించారు. చోరీకి గురైన విగ్రహాలను త్వరగా గుర్తించి, దొంగలను...
Read More...