ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక కొమురయ్య -జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

On

జగిత్యాల జులై 4 (ప్రజా మంటలు) ;

భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక కొమురయ్య జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. 

గురువారం కలెక్టరేట్ సమీకృత సముదాయంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తొలిసారిగా నూతన ప్రజాస్వామిక విప్లవ మార్గంలో సాయుధ పోరాట జెండాను చేబూని దేశానికి వేగుచుక్కగా తెలంగాణ నిలిచిందని, ఆఅ వీరోచిత రైతాంగ సాయుధ పోరాటంలో అడుగుపెట్టి భూమికోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగిన పోరులో రజాకార్ల ముష్కరుల తుపాకి తూటాలకు నెలకొరిగిన  సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని, అతని జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సాయుధ పోరాట అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం మరవలేనిదని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి. రాంబాబు, రఘువరన్,కలెక్టరేట్ ఏ.ఓ.హనుమంత రావు,  వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags