అక్రమ మట్టి తవ్వకాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
కోరుట్ల ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు)
పట్టణములోని శివారులో ఏసుకొని గుట్ట ప్రాంతంలో అక్రమంగా మట్టి తవ్వకాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్
గురువారం రోజున కోరుట్ల పట్టణంలోని శివారులోని ఏసుకొని గుట్టని ఆర్డీవో జివాకర్ రెడ్డి తో కలసి పరిశీలించారు.
అక్రమ మట్టి తవ్వకాలు ఉపయోగించిన జెసిబిని ఆ ప్రాంతంలో చూసి దానిని సీజ్ చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
మట్టి ఇసుక రవాణాపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
అక్రమ మట్టి రవాణా జరగకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కోసం ఏసుకొని గుట్ట ప్రాంతంలో 1254 సర్వే నెంబర్ లో ఉన్న 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కలెక్టర్ పరిశీలించారు.
ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
అనంతరం కోరుట్ల మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీలు చేశారు.
మున్సిపల్ కార్యాలయంలోనీ పలు విభాగాలను సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు.
మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన పలు రికార్డులు రిజిస్టర్లను ఇంటి పన్ను రికార్డులను పరిశీలించారు. 100% ఇంటి పన్ను సకాలంలో పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశించారు.
రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటికి ఇబ్బంది లేకుండా కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో, ఆర్డీవో జీవాకర్ రెడ్డి, ఎమ్మార్వో , మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం

లైంగిక వేదింపులు కేసులో ఇద్దరికీ 2 నెలల జైలు శిక్ష
.jpeg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

ధరణి దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు

ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు

విద్యకు బడ్జెట్ లో15 శాతం నిధులను కేటాయించాలి - ఎబివిపి

మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని కవిత విమర్శ

దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేత
.jpg)
భయం వీడితే విజయం మనదే...

సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవ, కళ్యాణ కరపత్రికను ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత
.jpg)