కరీంనగర్ పట్టభద్రుల MLC ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి మండల కేంద్రంలోని వైష్య భవన్ లో పట్టభద్రులు మరియు పార్టీ నాయకులు,కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల MLC అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కోరారు.
ఈ సంధర్భంగా మాట్లాడారు..
కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి మన MLC అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని,ధర్మపురి నియోజకవర్గ పట్టబద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, గెలిపించాలని కోరారు.మ
మన ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలం లోపే దాదాపు 56 వేల నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించింది మన రేవంత్ రెడ్డి ,మన కాంగ్రెస్ ప్రభుత్వమని,గత 10 సంవత్సరాల్లో బి.ఆర్.ఎస్ ప్రభుత్వ పాలకులు ఒక్క నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉండే ప్రభుత్వమని,నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఇంటింటికి గడపగడపకు వెళ్లి పట్టభద్రులను కలిసి మన ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని,
ఈ నెల 21 న ధర్మపురిలో నిర్వహించే శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచార సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని, ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీ గెలుపుకొరకు ఎలా అయితే కష్టపడ్డారో అదే విధంగా ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం మనందరం కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ భీమ సంతోష్ వైస్ చైర్మన్ పురపాటిరాజి రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి డైరెక్టర్లు కొక్కుల జలంధర్, ఓరగంటి తిరుపతి, కట్ట లక్ష్మణ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు లంబ లక్ష్మణ్, రాపల్లి గంగన్న, రంగు శ్రీనివాస్ గౌడ్, డీలర్ రాజిరెడ్డి, రేవెల్లి లింగన్న మాజీ సర్పంచులు ఉపసర్పంచులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి డిఆర్డి ఎపిడి రఘువరన్

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులకు సులభతర విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

పెద్ధపూర్ జాతరకి వచ్చే భక్తులకు భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలి.

*ఘనంగా కాన్షీరాం 91 వ, జయంతి వేడుకలు

రేపే మల్లన్న జాతర, యాదవుల కుల దైవం మల్లన్న

యువత " మై భారత్ పోర్టల్ " ద్వారా యూత్ పార్లమెంట్ అవకాశాన్ని వినియోగించుకోవాలి. - కేంద్రమంత్రి బండి సంజయ్

గాంధీలో గ్లకోమా నివారణ వారోత్సవాలు - డాక్టర్లతో అవెర్నెస్ ర్యాలీ

మీసేవ సెంటర్ ను తనిఖీ చేసిన తహసిల్దార్ ప్రసాద్.
