అసెంబ్లీకి నై...పార్టీ ఆఫీస్ కు సై...అనడం ఏంటి..?

* ఎక్స్ వేధికగా మాజీ సీఎం కేసీఆర్ కు ప్రశ్నలు
* వీటికి జవాబులు చెప్పాలన్న ఏఐసీసీ మెంబర్ డా.కోట నీలిమ
సికింద్రాబాద్, ఫిబ్రవరి 19 ( ప్రజామంటలు) :
ప్రజాసమస్యలు పట్టక, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిపై అయినా అసెంబ్లీకి రాకుండా కేవలం ఫాంహౌస్ కు పరిమితమయ్యే ప్రతిపక్ష నాయకుడు, బీఆర్ఎస్ నేత కె.చంద్రశేఖరరావు హైదరాబాద్ లో పార్టీ క్యాడర్ తో మీటింగ్ పెట్టడంపై బుధవారం కాంగ్రెస్ సనత్ నగర్ ఇంచార్జి డా.కోట నీలిమ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రతిపక్ష స్థానం ఇచ్చిన ప్రజల వద్దకు వచ్చే తీరికలేదా ప్రతిపక్షపార్టీ నేతకు.?- తెలంగాణ బడ్జెట్ 2025 అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు ఎందుకు రాలేదు.? ప్రజల తరపున మంచి సూచనలు స్వాగతిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినా పట్టదా.?- తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభోత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఇంటికి వచ్చి మర్యాద పూర్వకంగా పిలిచినా రాకపోవడం యావత్ తెలంగాణ ప్రజలను అవమానించినట్లు కాదా.?- దేశ మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించడానికి అసెంబ్లీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశానికి గైర్హాజరవడం డేశంపట్ల, ఒక గౌరవప్రదమైన నేతకిచ్చే విలువ ఇదేనా.? తెలంగాణ పౌరుల తరపున సంధించిన పై ప్రశ్నలన్నిటికీ సమాధానమిచ్చే సత్తా ఉందా... అంటూ కేసీఆర్ కు ప్రశ్నలను సందిస్తూ డా.నీలిమ ట్విట్ చేసారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం

లైంగిక వేదింపులు కేసులో ఇద్దరికీ 2 నెలల జైలు శిక్ష
.jpeg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

ధరణి దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు

ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు

విద్యకు బడ్జెట్ లో15 శాతం నిధులను కేటాయించాలి - ఎబివిపి

మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని కవిత విమర్శ

దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేత
.jpg)
భయం వీడితే విజయం మనదే...

సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవ, కళ్యాణ కరపత్రికను ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత
.jpg)