బాధిత విద్యార్థికి తక్షణమే న్యాయం చేయాలి - ఏబీవీపీ
బాధిత విద్యార్థికి తక్షణమే న్యాయం చేయాలి
* అవినాష్ కాలేజీ మీద చర్యలు తీసుకోవాలి
* ఏబీవీపీ నాయకుల ఆందోళన
సికింద్రాబాద్ ఫిబ్రవరి 13 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ అవినాష్ కాలేజీ అరాచకాలు రోజు రోజుకు పెరు గుతున్నాయని, వెంటనే అవినాష్ కాలేజీపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ బాలు డిమాండ్ చేశారు. విద్యార్థులు గొడవపడ్డ కారణంగా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న రాహుల్ అనే దళిత విద్యార్థిని బహిష్కరించి, రోడ్డుపైకి నెట్టడాన్ని, విద్యార్థిపై బూటకపు కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ గురువారం అవినాష్ కాలేజీ ప్రధాన గేట్ ముందు ఏబీవీపీ నాయకులు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ బాలు మాట్లాడుతూ.. కాలేజీ నుంచి బహిష్కరింపబడిన దళిత విద్యార్థికి న్యాయం చేసి, అవినాష్ కళాశాల అనుమతులను రద్దు చేయాలని అన్నారు. బౌన్స ర్లతో కళాశాలను నడిపించడం ఇదెక్కడి సంస్కృతి అని, నిబంధన లకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేయడం దారుణమని అన్నారు. దళిత విద్యార్థినిని చీకటి గదిలోవేసి కొట్టి రోడ్డు మీద పడేసిన అవినాష్ కళాశాల చైర్మన్ అవినాష్ ను వెంటనే అరెస్ట్ చేయాలని బాలు డిమాండ్ చేశారు.కాలేజీపై చర్యలు తీసుకోవాలని లేనిచో తమ పోరాటం ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. కాలేజీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గోపాలపురం పోలీస్ స్టేషన్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నేతలను అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు బలవంతంగా వాహనంలో తీసుకువెళ్ళారు. కాసేపు కాలేజీ ఆవరణలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
More News...
<%- node_title %>
<%- node_title %>
భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు
