రేషన్ కార్డుల సర్వే లో దళారుల జోక్యం నివారించండి * డీసీ కి మర్రి పురూరవరెడ్డి వినతి
రేషన్ కార్డుల సర్వే లో దళారుల జోక్యం నివారించండి
* డీసీ కి మర్రి పురూరవరెడ్డి వినతి
సికింద్రాబాద్, జనవరి 18 ( ప్రజామంటలు ):
రేషన్ కార్డుల సర్వే లో దళారుల జోక్యాన్ని నివారించి, అర్హులైన వారికి న్యాయం చేయాలని రాష్ర్ట బీజేపీ యువమోర్చా నాయకులు మర్రి పురూరవరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి ఈ విషయమై వచ్చిన ఫిర్యాదుల మేరకు శనివారం మర్రి పురూరవరెడ్డి బీజేపీ ముఖ్య నాయకులతో సికింద్రాబాద్ బేగంపేట సర్కిల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యను కలసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అఖిలపక్ష నాయకుల సహకారం తీసుకోవాలని సూచించారు. దళారుల మాటలు విని, అర్హులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట సీనియర్ బీజేపీ నాయకులు రవీందర్ రెడ్డి, కే.కృష్ణ, అంబాల ఈశ్వర్ బాబు, ఎ.కుమార్, కిరీటా, వికాస్, పార్శీ పరమేశ్, నరేశ్, సురేశ్ ఉన్నారు.