సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అక్రమ కేసులా?
జగిత్యాల జనవరి 18 (ప్రజా మంటలు)
కాంగ్రెస్ హామీలు నెరవేర్చమని సోషల్ మీడియాలో పోస్ట్లు పెడితే అక్రమ కేసుల?
*ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్న అందుకే అక్రమ కేసుల*?
నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గంగారెడ్డి సోషల్ మీడియాలో కళ్యాణ లక్ష్మి కింద వచ్చే లక్ష రూపాయల చెక్కుతోపాటు తులం బంగారం ఏది అని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే దానికి గాను అర్ధరాత్రి పోలీసులు ఇంటికి వచ్చి వేధించి పైఅధికారులతో ఫోన్లు చేయించి పోస్టులు తీసేయాలని భయపెట్టిన సందర్భంగా జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గంగారెడ్డి యూత్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ...
*ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేలేక కక్షపూరితంగా బిఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
ఆరు గ్యారెంటీలు అమలు చేయమని అడిగితే అక్రమ కేసుల...
ఎన్ని రకాలుగా వేధించిన,ఎన్ని కేసులు పెట్టిన ఇచ్చిన హామీలు నెరవేర్చదాక ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు.
తులం బంగారం ఏది అని అడిగినందుకు పోలీసులతో వేధింపుల అన్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు హరీష్ నీలి ప్రతాప్ ముత్యాల మహేష్ బాలె చందు జలంధర్ రంజిత్ తదితరులు ఉన్నారు.