గాంధీలో 3 రోజుల పాటు సీపీఆర్ పై ఉచిత ట్రైనింగ్
గాంధీలో 3 రోజుల పాటు సీపీఆర్ పై ఉచిత ట్రైనింగ్
* గాంధీ అలుమ్ని, గ్లోబల్ అలుమ్ని, జనహిత ఆధ్వర్యంలో క్యాంప్
*5వేలకు పైగా సిటిజన్స్ కు సీపీఆర్ శిక్షణ
సికింద్రాబాద్, జనవరి 17 (ప్రజామంటలు):
గుండెపోటు వచ్చిన సమయంలో ఫస్ట్ ఏయిడ్ గా అత్యవసరంగా నిర్వహించే సీపీఆర్ (కార్డియో ఫల్మనరి రిస్యూసిటేషన్) ఎలా చేయాలో తెలిపే కమ్యూనిటీ సీపీఆర్ ట్రైనింగ్ ను సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ అలుమ్మి భవనంలో ఈనెల 19 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈమేరకు శుక్రవారం గాంధీ అలుమ్మి ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్వాహకులు గాంధీ మెడికల్ కాలేజీ అలుమ్ని అసోసియేషన్, గ్లోబల్ అలయెన్స్,జనహిత సేవా ట్రస్ట్ ప్రతినిధులు సీపీఆర్ ట్రైనింగ్ కు సంబందించిన వివరాలను వెల్లడించారు. గత నాలుగేళ్ళుగా తమ ఆధ్వర్యంలో చేస్తున్న సీపీఆర్ ట్రైనింగ్ క్యాంపులో 30వేలకు పైగా వివిద రంగాల్లోని వారికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇందులో డాక్టర్లు, నర్సులు, పోలీసులు, ఆటో డ్రైవర్లు, ట్రాఫిక్ సిబ్బంది, ఇంటర్,డిగ్రీ, ఇంజనీరింగ్ స్టూడెంట్లు, 108 సిబ్బంది ఉన్నారని అన్నారు. హార్ట్ ఎటాక్ వచ్చిన సమయంలో వ్యక్తికి అత్యవసరంగా గోల్డెన్ హవర్స్ గా పరిగణించే ఆ టైమ్ లో కొన్ని నిమిషాల పాటు ఛాతీ భాగంలో సీపీఆర్ చేస్తే, ప్రాణపాయం నుంచి బయట పడే అవకాశం ఉంటుందన్నారు. ఆసుపత్రికి తీసుకెళ్ళే ముందుగా సీపీఆర్ చేసిన గత సందర్బాల్లో చాలా మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని వారు గుర్తు చేశారు. సీపీఆర్ ట్రైనింగ్ ఒక గంట పాటు ఉంటుందని, ఇందులో మానవ బొమ్మపై ప్రాక్టికల్ తో పాటు థియరీ క్లాస్ ఉంటుందన్నారు. ఉచితంగా నిర్వహించే ఈ సీపీఆర్ ట్రైనింగ్ లో ప్రతి రంగానికి చెందిన పౌరులు పాల్గొని, శిక్షణ పొందాలని వారు కోరారు. ప్రతి ఒక్కరు సీపీఆర్ నేర్చుకుంటే గుండెపోటు వచ్చిన అత్యవసర సమయంలో ఎదుటి వారి ప్రాణాలను కాపాడే వైద్యులు అవుతారని, మరోజన్మ ప్రసాదించిన దేవుళ్ళుగా కొనియాడ బడతారన్నారు. ఈ ఏడాది నిర్వహించే సీపీఆర్ ట్రైనింగ్ లో 5వేలకు పైగా మందికి శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ట్రైనింగ్ తీసుకునే వారు ముందుగా 8179713704, 9063182058, 9247378469 నెంబర్లకు ఫోన్ చేసి, తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. సమావేశంలో గాంధీ మెడికల్ కాలేజీ అలుమ్ని అసోసియేషన్ ప్రెసిడెంట్ డా.జీఆర్ లింగమూర్తి, గ్లోబల్ అలుమ్ని ట్రస్టీ డా.రవీందర్ సురకంటి, సెక్రటరీ కొలిపాక డా.రాజశేఖర్, ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ కో ఆర్డినేటర్ డా.మహేశ్వర్ రెడ్డి, అమెరికా హార్ట్ అసోసియేషన్ ఇంచార్జీ డా.డెనిస్ మెకాలే(చికాగో) జనహిత సేవాట్రస్ట్ నిర్వహకులు నరసింహామూర్తి పాల్గొన్నారు.