రేషన్ కార్డులను అర్హులైన అందరికీ ఇవ్వాలి బిజెపి మండల అధ్యక్షుడు భాయ్ లింగారెడ్డి,
రేషన్ కార్డులను అర్హులైన అందరికీ ఇవ్వాలి
బిజెపి మండల అధ్యక్షుడు భాయ్ లింగారెడ్డి,
ఇబ్రహీంపట్నం జనవరి 17 (ప్రజా మంటలు)
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న రైతు భరోసా,ఇందిరమ్మ ఇల్లు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలతో పాటు, కొత్త రేషన్ కార్డు లు ఇప్పటి వరకు ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని బీజేపీ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు బాయి లింగారెడ్డి కోరారు.
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలం గడుపుతూ ప్రజలను మోసం చేస్తున్నారని కొత్తగా సర్వే పేరుతో రేషన్ కార్డుల మీద నిబంధనలు పెట్టకూడదని గత 11సంవత్సరం నుండి రేషన్ కార్డు గత ప్రభుత్వం ఇవ్వకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడ గత ప్రభుత్వం లో దరఖాస్తు చేసుకున్న వారికే ఇస్తాం అనడం వీడురంగ ఉందని అన్నారు,
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన వారందరికీ ప్రతి ఇంటికి కొత్తగా రేషన్ కార్డు లు ఇవ్వాలని ఏ నిబంధనలు పెట్టిన ప్రజల పక్షాన ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నం అని మండల అధ్యక్షుడు బాయ్ లింగారెడ్డి తెలిపారు ,