రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తున్నదా? ఫ్యాక్షనిస్టు ప్రభుత్వం నడుస్తున్నదా?-దావ వసంత సురేష్
గంగాధర జనవరి 17 (ప్రజా మంటలు)
మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ గారి ఇంటి పైన కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన సందర్భంగా ఈరోజు గంగాధర్ మండలం బురుగు పల్లి లో వారి నివాసంలో ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ గారిని పరామర్శించిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ గారు రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి గారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
*మాజీ ఎమ్మెల్యే సుంకర శంకర్ గారి ఇంటి పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము.
*శాంతి భద్రతల విచ్ఛిన్నం చేసే కుట్ర, ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతుంది.
*శాంతి భద్రతలు ఎక్కడా ఉంటాయో అక్కడ అభివృద్ధి,పెట్టుబడులు వస్తాయి.
*రాజకీయం కోసం శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే అభివృద్ధి,ఉద్యోగ కల్పన ఆటంకం కలుగుతుంది అని ప్రభుత్వం గుర్తించాలి.
*చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెస్ నాయకులు దాడులు జరపడం ప్రజా స్వామ్య వ్యతిరేకం.
*ఈ పదేళ్లు ఎలాంటి దాడులు లేవు ఒక దళిత మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగితే ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్తితి ఏంటి?
*పోరాటాలే ఊపిరిగా పుట్టిన గులాబీ పార్టీ నేతల ఆత్మస్థయిర్యాన్ని ఇలాంటి చిల్లర చేష్టలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ దెబ్బతీయలేదు.
వారి వెంట మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఒద్దినేని హరి చరణ్ రావు గారు,మాజీ జడ్పీటీసీ సభ్యులు రామ్మోహన్రావు నాగం భూమయ్య, చొప్పదండి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.