పట్టణంలోని 6 7 8 వార్డులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన పాల్గొన్న ఎమ్మెల్యే ,చైర్పర్సన్
జగిత్యాల జనవరి 16 (ప్రజా మంటలు)
పట్టణములోని 6వ,7వ,8వ వార్డులలో 1 కోటి 5 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయా వార్డులలో శంకుస్థాపనలు చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
జగిత్యాల పట్టణ అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి ద్యేయంగా పనిచేస్తా ..
1 కోటి 5 లక్షలతో అభివృద్ధి పనులకు భూమిపూజ చేయటం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో జగిత్యాల లో 70 కోట్ల తో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
మోతే చెరువు లో మురుగు నీరు చేరకుండా 2 కోట్ల 80 లక్షలతో STP ఏర్పాటు.
నూకపల్లి డబుల్ బెడ్ ఇండ్లను జగిత్యాల మున్సిపల్ లో కలిపే ప్రక్రియ తుది దశలో ఉందని,గవర్నర్ సంతకం అయింది గెజిట్ రావాల్సిఉంది అన్నారు.
జగిత్యాల పట్టణంలో గత మున్సిపల్ లో చేసిన పనుల కన్నా 5 రేట్ల పైగా పనులు చేయడం జరిగిందనీ గుర్తు చేసారు.
ఒక్కో వార్డు లో 1 కోటి నిధుల పైగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయటం జరిగిందన్నారు.
నూతన నిర్మాణాలు చేపట్టే ముందు లేఅవుట్ ప్రకారం నిర్మాణం చేపట్టాలన్నారు.
జగిత్యాల పట్టణం లో అమృత్ కార్యక్రమం లో భాగంగా ప్రతి ఇంటికి మంచినీటి అందజేయడం కోసం పనులు జరుగుతున్నాయి అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ అడు వాల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గొలి శ్రీనివాస్,కమిషనర్ చిరంజీవి,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,స్థానిక కౌన్సిలర్ లు కొలాగాని ప్రేమలత సత్యం, వల్లేపు రేణుక మొగిలి,మలవ్వ తిరుమలయ్య,కో ఆప్షన్ శ్రీనివాస్,కౌన్సిలర్ లు,కో ఆప్షన్ సభ్యులు,నాయకులు కార్యకర్తలు, వార్డు ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.