అనునిత్యం విధులలో ఉండే పోలీసులకు క్రీడలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి: జిల్లా జడ్జి నీలిమ
జగిత్యాల జనవరి 17 (ప్రజా మంటలు)
అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ స్థానిక పోలీస్ పరేడ్ మైదానం లో 3వ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 ఘనంగా ముగిశాయి. ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి నీలిమ , జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ హాజరై క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా జడ్జి నీలిమ మాట్లాడుతూ ..... ఎంతో పని ఒత్తిడితో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ వారికి స్పోర్ట్స్ మీట్ అనేది చాలా అవసరమని ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ వల్ల మరింత ఉత్సాహంతో విధులు నిర్వహించవచ్చు అన్నారు. మంచి ఆరోగ్యమే ఒక సంపద మంచి ఆరోగ్యం మనకు లభించాలంటే స్పోర్ట్స్ ద్వారానే వస్తుందని అన్నారు. రాబోయే రోజుల లో జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు మరింత ఉస్తానగా విధులు నిర్వహిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.
ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ ..... క్రీడలలో గెలుపోటములు సహజమని ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తితో ఈ క్రీడల్లో పాల్గొనడం/పార్టీసిపేషన్ ముఖ్యమన్నారు. ప్రతిరోజు విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి ఆటవిడుపుగా ఇలాంటి క్రీడా పోటీల లో పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పొందరని అన్నారు. కష్టపడితేనే క్రీడల్లోనైనా, ఏ వృత్తిలోనైనా ఫలితం ఉంటుందన్నారు. పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి, శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి క్రీడలు దోహదపడతాయన్నారు. అన్ని క్రీడల్లో హోంగార్డు ఆఫీసర్ నుంచి అధికారుల వరకు మంచి పోటాపోటీ ని ఇస్తూ క్రీడాస్ఫూర్తిని కనబరచాలని అన్నారు. స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్మెంట్ ద్వారా జీవితంలో లక్ష్యాలకు దగ్గరగా చేరుకోగలుగుతమని. ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ వల్ల ఉద్యోగుల్లో టీం వర్క్ అనేది ఏర్పడుతుందని అన్నారు. టీం వర్క్ వల్ల ఎప్పుడు విజయాలే కలుగుతాయని ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ అనేది ఇంత విజయవంతం కావడానికి టీం వర్క్ ముఖ్య కారణం అన్నారు. ఈయొక్క పోలీస్ స్పోర్ట్స్ మీట్ ను ఇంత ఘనంగా నిర్వహించడం లో కృషి చేసిన జిల్లా అదనపు ఎస్పీ, డీఎస్పీలు, మరియు వారి టీం ని జిల్లా ఎస్పీ అభినందించారు. మరియు యొక్క క్రీడా పోటీలను నిర్వహించిన PET లకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం క్రీడా పోటీలలో విజేతలకు జిల్లా జడ్జి శ్రీమతి నీలిమ , జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలసి ట్రోఫీ లు అందజేశారు.
విజేతలు వీరే!
1.ఓవరాల్ ఛాంపియన్ : DAR -Jagtial.
2 .టగ్ ఆఫ్ ఫర్ విన్నర్ : DAR - Jagtial, రన్నర్స్ : Jagtial sub division
3.వాలీబాల్ విన్నర్స్ : DAR - Jagtial, రన్నర్స్ : Jagtial sub division.
4. క్రికెట్ విన్నర్స్ : DAR-Jagtia , రన్నర్స్ : Metpalli sub division
ఈ యొక్క కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీమ్ రావు, డిఎస్పీ లు రఘుచందర్, రాములు ,రంగా రెడ్డి ,A.O శశికల,DCRB,SB IT CORE ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, ఆరిఫ్ అలీ ఖాన్, రఫీ ఖాన్, సి.ఐ లు రాం నరసింహారెడ్డి, వేణుగోపాల్,రవి,కృష్ణారెడ్డి, నిరంజన్ రెడ్డి ,సురేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్ కుమార్,రామకృష్ణ, వేణు మరియు ఎస్. ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.