అర్బన్ మరియు రూరల్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల జనవరి 18 (ప్రజా మంటలు)
అర్బన్ మరియు గ్రామీణ మండలాలకు చెందిన 69 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 18 లక్షల రూపాయల విలువగల చెక్కులను ,108 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన 1 కోటి 81 వేల రూపాయల చెక్కులను అందేసిన జగిత్యాల పట్టణం జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ...
రైతులను రుణ విముక్తి చేయటానికి
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 21 వేల కోట్ల రుణ మాఫీ అమలు చేయటం జరిగింది.
రైతు భరోసా త్వరలో పంపిణీ చేస్తాం అన్నారు.
అర్హులైన లబ్ధిదారులకు అందరికీ రేషన్ కార్డులు అందిస్తామన్నారు.
రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా జగిత్యాల ప్రాంత,నియోజకవర్గ అభివృద్ధి కి కృషి చేస్తాను అన్నారు.
అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు దశల వారీగా అందజేస్తాం అన్నారు.
ఈ కార్యక్రమంలో పిఎస్‌ఎస్ ఛైర్మన్‌లు మహిపాల్‌రెడ్డి, సందీప్‌రావు, ఎమ్మార్వోలు, రామ్‌మోహన్, మాజీ ఛైర్మన్ కొలువురి దామోదర్ రావు, నక్కల రవీందర్ రెడ్డి, సురేందర్‌రావు, బాల ముకుందం,మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, నాయకులు పాల్గొన్నారు.