పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించండి
పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించండి
టీ పెన్షనర్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్
జగిత్యాల జనవరి 18:
తెలంగాణ పెన్షనర్ల పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని చెప్పి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ను టీ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో కలిసి పెండింగ్ బిల్లులు మంజూరు లో తీవ్రమైన ఆలస్యం జరగడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే 2024 నుంచి రిటైర్ అయిన వారికి జీ.పి.ఎఫ్,గ్రాట్యుటీ,కమ్యూటేషన్,లీవ్ సాలరీ తదితర ప్రయోజనాల పెండింగ్ బిల్లులను మంజూరు చేయాల్సిందిగా కోరడం జరిగిందని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ తెలిపారు.శనివారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం హైదరాబాద్ లో ఆర్థిక శాఖ కార్యదర్శిని కలువగా స్పందిస్తూ దశలవారీగా ఉద్యోగుల పెండింగ్ బిల్లులు అన్నింటిని మంజూరు చేస్తామని ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనే బిల్లుల చెల్లింపు కొంత ఆలస్యం జరుగుతున్నప్పటికీ తప్పకుండా అంశాల వారీగా బిల్లులను చెల్లిస్తామని టీపెన్షనర్ల నాయకులకు ఆర్థిక శాఖ కార్యదర్శి హామీ ఇవ్వడం జరిగిందన్నారు.సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం,సహాయ అధ్యక్షుడు పి.హన్మంత రెడ్డి,ఉపాధ్యక్షులు వెల్ముల ప్రకాష్ రావు,ఎం.డి.యాకూబ్,ఆర్గనైజింగ్ కార్యదర్శి పూసాల ఆశోక్ రావు,కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం,మెట్ పల్లి అధ్యక్షుడు వి.ప్రభాకర్ రావు,జగిత్యాల యూనిట్ అధ్యక్షుడు బి.రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.