నిజాంపేట లో ఘనంగా ఎన్ టీ ఆర్ వర్దంతి
నిజాంపేట లో ఘనంగా ఎన్ టీ ఆర్ వర్దంతి
నిజాంపేట లో ఘనంగా ఎన్ టీ ఆర్ వర్దంతి
సికింద్రాబాద్, జనవరి 18 (ప్రజామంటలు):
దివంగత మాజీ ముఖ్యమంత్రి, అలనాటి గొప్ప నటుడు నందమూరి తారకరామారావు వర్థంతిని శనివారం సిటీ లోని నిజాంపేట లో ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. నిజాంపేట లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అఖిల భారత కోలీ( ముదిరాజ్) సమాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్లు ఎన్ టీ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అటు సినీరంగంతో పాటు ఇటు రాజకీయ రంగంలో ఎంతో రాణించి, తెలుగు ప్రజల గుండెల్లో ఎన్ టీ ఆర్ చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఎన్టీఆర్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారని అన్నారు. ఆయన పేదల కోసం ప్రవేశపెట్టిన రెండు రూపాలయ కిలో బియ్యం ఎంతో ప్రాచుర్యం పొందిందన్నారు. బలహీన వర్గాల నేతగా ఆయనకు పేరుందన్నారు. అన్ని అర్హతలు కలిగిన ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని కోరారు.