అభివృద్ధే ధ్యేయంగా ముందడుగు. మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల జనవరి 18 ( ప్రజా మంటలు)
అభివృద్ధే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
శనివారం జిల్లా కేంద్రంలో 13,43,వ వార్డులలో 20 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయా వార్డులలో జగిత్యాల చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ భూమిపూజ చేశారు.
పట్టణంలో యేండ్ల క్రితం వేసిన రహదారులన్ని గుంతలమయంగా మారాయని అభివృద్ధిలో భాగంగా ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే రహదారుల డ్రైనేజీ లు సిసి రోడ్లు పనులు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.
పట్టణంలో ఒక్కో వార్డులో ఇప్ప టికే రూ.కోటికి పైగా నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ప్రజలు ఇళ్ల నిర్మాణం చేపట్టే ముందు లే అవుట్ ప్రకారం చేయాలన్నారు. అమృత్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ మంచినీరు అందజేయడం కోసం పనులు జరుగుతున్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో ,కమిషనర్ చిరంజీవి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు ఆసియా సుల్తానా-కమల్, ఫిర్దూస్ బేగం-నదీమ్,AE శరన్,కౌన్సిలర్ లు,కో ఆప్షన్ సభ్యులు,వార్డు నాయకులు కార్యకర్తలు, వార్డు ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.