జిల్లా కలెక్టర్ మరియు ఉద్యోగుల పై దాడిని ఖండించిన జెఎసి చైర్మన్ మారం జగదీశ్వర్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 14 (ప్రజా మంటలు)
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఐ.ఏ.ఎస్ మరియు కాడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి మరియు ఇతర అధికారులపై లగిచర్ల గ్రామంలో జరిగిన దాడికి నిరసనగా ఈరోజు జగిత్యాల జిల్లా సముదాయము లో జే.ఏ.సీ ఆద్వర్యంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జ్ లు ధరించి నిరసన తెలుపడం జరిగింది.
తదుపరి జగిత్యాల కు విచ్చేసిన తెలంగాణ ఉద్యోగ జెఎసి చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ..... వికారాబాద్ కలెక్టర్ మరియు సిబ్బందిపై జరిగిన దాడి చాలా బాధాకరమని, ప్రభుత్వం ద్వారా ఫార్మా కంపెని కొరకు భూసేకరణ కొరకు వెళ్లిన ఉద్యోగులపై దాడి చేయడం చాలా బాధాకరమని ఇట్టి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము అని తెలిపినారు.
ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి దిగడం వలన ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీస్తాయి కనుక ఇటువంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే దోషులను శిక్షించాలని కోరినారు.
టిఎన్జిఓ జిల్లా కార్యదర్షి మిర్యాల నాగేందర్ రెడ్డి, ట్రెసా అద్యక్షులు యం.డి. వకీల్, పెన్షనర్ల సంఘం హరి అశోక్ కుమార్, కలెక్టరేట్ ఏఒ హన్మంతరావు, పిఆర్టియు అద్యక్షులు బోయిన్పల్లి అనందరావు, టిజిఒ సహద్యక్షులు రవిబాబులు మాట్లాడుతూ.... వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై మరియు రెవెన్యూ ఉద్యోగులపై జరిగిన దాడి ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని మరియు ఉద్యోగుల భద్రత ను ప్రశ్నించే విధంగా ఉందని ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మరియు ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసే ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకు పోవడమే కాకుండా, ప్రభుత్వం ద్వారా జారీ చేయబడిన ఆదేశాలను అమలు చేయడంలో ప్రత్యేక పాత్ర పోషించడం జరుగుతుంది ఇట్టి చర్యను ఖండించినారు.
ఇట్టి కార్యక్రమంలో టి.ఎన్.జి.ఓస్ మరియు జే.ఏ.సీ తరఫున కరీంనగర్ అద్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, నాయకులు రాగి శ్రీనివాస్, వెంకటేశ్వర్ రావు, టిజిఒ జిల్లా కార్యదర్షి మామిడి రమేష్ టీఎన్జీవో నాయకులు అమరేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, షాహిద్ బాబు, రవిచంద్ర, రవీందర్, మహమూద్, రాజశేఖర్, రాజేందర్, రాజేశం, సుగుణాకర్, మధుకర్, హరి ప్రసాద్, భువనేశ్వర్, కుమారస్వామి, సురేందర్, భాస్కర్, శ్రీనివాస్, మురళి, చంద్రిక, మమత, శైలజ, విజయలక్మి, అర్చన, నాగరాజు, సురేందర్ నాయక్, పూర్ణచందర్, ఆనంద్,రవి, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చంద్రయ్య, ముజాహిద్ ఖాన్, అరుణ, అజీం, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.