తెలంగాణ బీసీ సాధికారత సంఘం రాష్ట్ర కార్యదర్శిగా గుడాల రాజేష్ గౌడ్
తెలంగాణ బీసీ సాధికారత సంఘం రాష్ట్ర కార్యదర్శిగా గుడాల రాజేష్ గౌడ్
- నియామకపు పత్రం అందజేసిన ప్రతాని రామకృష్ణ గౌడ్
జగిత్యాల జూలై 26 (ప్రజా మంటలు) : తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సాధికారత సంఘం రాష్ట్ర కార్యదర్శిగా జగిత్యాల పట్టణానికి చెందిన గుడాల రాజేష్ గౌడ్ నియామకం అయ్యారు. వెనుక బడిన తరగతుల కోసం నిరంతరం కృషి చేస్తూ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. వాటిని గుర్తించి శుక్రవారం రోజున హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ రాజేష్ గౌడ్ కు నియమకాపు పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీ కులస్తులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సంక్షేమ పథకాలు అందే విదంగా కార్యాక్రయాలు చేపట్టి అవగాహన కల్పించేందుకు నిరంతరం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తాను చేపట్టే కార్యక్రమాలు గుర్తించి రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు బీసీ సాధికారత సంఘానికి రాజేష్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.