రాయబారేలిలో విశాఖ ఇండస్ట్రీస్ ఆటమ్ సోలార్ రూఫ్ ప్రారంభం
సికింద్రాబాద్ ఏప్రిల్ 29 (ప్రజామంటలు):
:
పునరుత్పాదక ఇంధన రంగాన్ని పురోగమింపజేసే దిశగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం రాయ్‌బరేలీలో విశాకా ఇండస్ట్రీస్ రూపొందించిన ఆటమ్ సోలార్ రూఫ్ ను అధికారికంగా ప్రారంభించినట్లు కంపెనీ ప్రతినిధులు హైదరాబాదులో మీడియాకు తెలిపారు.
ఈ కార్యక్రమం భారతదేశంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మరియు గ్రీన్ మోబిలిటీ పరిష్కారాలను వేగవంతం చేసే దిశగా ఒక కీలక ముందడుగు అని వారు అన్నారుఈ ప్రారంభ వేడుకలో, ఆటమ్ చార్జింగ్ స్టేషన్లు మరియు ఆటమ్ ఈ-బైక్లను కూడా ప్రారంభించారు. ఈ పరిష్కారాలు విశాకా ఇండస్ట్రీస్ యొక్క పర్యావరణ అనుకూలమైన, ఆవిష్కరణాత్మక దృష్టిని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమానికి చెన్నూరు ఎమ్మెల్యే డా. వివేక్ వెంకటస్వామి , డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ గడ్డం సరోజ, పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు, విశాఖ ఇండస్ట్రీస్ డైరెక్టర్ గడ్డం వంశీ, లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ..., పునరుత్పాదక ఇంధన వనరులు భవిష్యత్తు తరాల కోసం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
భారత్ ను గ్రీన్ ఎనర్జీ మార్గంలో ముందుకు తీసుకెళ్లడంలో ఆటమ్ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన ప్రశంసించారు.ఆటమ్ సోలార్ రూఫ్ ప్రత్యేకత ఏమిటంటే — ఇది ఒకే సారి నాణ్యమైన రూఫింగ్ మెటీరియల్‌తో పాటు సౌరశక్తిని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆటమ్ చార్జింగ్ స్టేషన్లు వీటి ఆధారంగా స్వయం సమృద్ధి సాధించగలిగే పునరుత్పాదక విద్యుత్తును వినియోగదారులకు అందిస్తాయి,
దీనివల్ల విద్యుత్తు పై ఆధారపడకుండా, స్వచ్ఛమైన శక్తిని అందించవచ్చు అని అన్నారు. విశాకా ఇండస్ట్రీస్ తన ఆటమ్ శ్రేణి ఉత్పత్తుల ద్వారా పర్యావరణానికి మిత్రమైన పరిష్కారాలను సాధారణ జీవితంలోకి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వాలిబాల్ వేసవి ఉచిత శిక్షణ శిబిరం ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి. కోచ్ తాండ్ర పవన్
1.jpeg)
నిబద్దతతో చేసిన పనులే అధికారులకు గుర్తింపునిస్తాయి.. *పదవి విరమణ చేసిన తహసీల్దార్ ఎస్.అశోక్ కుమార్

మండు టెండలో రోడ్డుపై పాకుతూ.. కూటి కోసం ఓ యాచకుడి నరకయాతన

శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కు అందజేత

భూ భారతి చట్టంతో సాదా బైనామాలకు పరిష్కారం.....జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

రాయబారేలిలో విశాఖ ఇండస్ట్రీస్ ఆటమ్ సోలార్ రూఫ్ ప్రారంభం

తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ రెండవ విలన్ బి ఆర్ ఎస్.

ఘనంగా హరిహరాలయ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం

నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్

పహాల్గమ్ " ఉగ్రదాడి తీవ్ర విచారకరం *తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్

కళ్యాణం కమనీయం ...వెంకన్న కళ్యాణం..బోయగూడలో..
.jpg)
మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు
