ఘనంగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ ముగింపు
గొల్లపల్లి ఎప్రిల్ 24 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని భీమ్రాజు పల్లి గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి ప్రధమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవములు బ్రహ్మశ్రీ అత్తులూరి బాల శంకర్ శాస్త్రి, నాగుల మల్యాల వీరాచార్యులు కరకముల చేతుల మీదుగా ఆలయ ధర్మకర్త చింతపండు తిరుపతిరెడ్డి, శశికళ దంపతులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి గురువారం శ్రీ అభయాంజనేయ స్వామి వారికి అభిషేకం, బొడ్రాయికి గ్రామస్తులంతా జలాభిషేకం, మహా కలశం పూజ, పుణ్యాహవాచనం, సర్వదేవతావాహనం, అష్టోత్తర శతకలశ దేవతా ఆవాహనం, అగ్ని ప్రతిష్టాపన హోమాలు, పూజలు వైభవంగా జరిగాయి. వేద పండితులకు ఘనంగా సన్మానం చేశారు.
షీలా అశోకు కళావతి దంపతులు అన్నదానం చేశారు.సాయంత్రం శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఉత్సవ ఊరేగింపు కన్నుల పండువగా సాగింది ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జెసి కందుకూరి కృష్ణారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మెన కుమార్, వైస్ చైర్మన్ సింగారం మహేష్, సభ్యులు కంది స్వామి, సింగారపు లచ్చయ్య, రేవెల్ల సత్తయ్య, పొట్ట తిరుపతి, చింతల మల్లేష్,మాజీ ఉపసర్పంచ్ దూస రవి, సామల జనార్ధన్ , కిరణ్,రేవెల్ల గంగయ్య, బ్రాహ్మణులపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నూతన ఆర్ఓఆర్ చట్టంపై జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ డీలర్మృతి

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్

మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న షి టీమ్,భరోసా సెంటర్

బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం

సూర్య ధన్వంతరి ఆలయము లో ఘనంగా కుంకుమ పూజలు

ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా రాజారావు

క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో హైస్కూల్ మైదానంలో కొవ్వొత్తుల ర్యాలీ
