బుగ్గారం జి.పి.లో దొంగ నిర్మాణ అనుమతులు -  ఆన్ లైన్ లో కనిపించని ఇండ్ల వివరాలు

On
బుగ్గారం జి.పి.లో దొంగ నిర్మాణ అనుమతులు -   ఆన్ లైన్ లో కనిపించని ఇండ్ల వివరాలు

వసూలైన ఇంటి పన్నులూ మాయం
దొంగ రశీదులతో ఇంటి పన్నుల వసూళ్లు

ట్రెజరీ లో జమ కాలేదని ఆరోపణ
గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ విచ్చల విడి దోపిడి

గ్రామ సభలో  స్పెషల్ ఆపీసర్ కు పిర్యాదు
ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించి భూగర్భ జలాలను పెంచుదాం - స్పెషల్ ఆపీసర్ జి.సునిత  


బుగ్గారం ఏప్రిల్ 24:

జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ హయాంలో ఇండ్ల నిర్మాణానికి దొంగ అనుమతి పత్రాలు జారీ అయ్యాయని ఆరోపిస్తూ తెలంగాణ జనసమితి పార్టీ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి గురువారం స్పెషల్ ఆపీసర్ జి. సునిత కు పిర్యాదు చేశారు. బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో స్పెషల్ ఆపీసర్ జి. సునిత అధ్యక్షతన గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో స్పెషల్ ఆపీసర్ కు చుక్క గంగారెడ్డి ప్రత్యేకంగా పిర్యాదు చేస్తూ గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ విచ్చల విడిగా దోచుకున్నారని ఆరోపించారు.
భారీగా అవినీతికి పాల్పడి సుమారు 30 ఇండ్ల కు దొంగ అనుమతి పత్రాలు జారీ చేశారని అన్నారు. ఆ ఇండ్ల వివరాలు నేడు ఆన్ లైన్ లో కనబడడం లేదన్నారు. అదే ఇండ్ల పై ప్రతి ఏటా వసూలు చేసిన ఇంటి పన్నులు కూడా గ్రామ పంచాయతీ కార్యాలయ రికార్డులలో నమోదు కాలేదన్నారు. అట్టి రశీదుల సొమ్ము కూడా ట్రెజరీ ద్వారా బ్యాంక్ ఖాతాలో కూడా జమ కాలేదని చుక్క గంగారెడ్డి సూచించారు. స్థానిక మండల పంచాయతీ అధికారి దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లినా నేటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని చుక్క గంగారెడ్డి ఆరోపించారు. మండల పంచాయతీ అధికారి అఫ్జల్ మియా, గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ లు ఇద్దరూ కుమ్మక్కై ఈ అక్రమాలు చేసి ఉంటారని పలు అనుమానాలు వ్యక్తం చేసారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో తగు విచారణ జరిపి గత పంచాయతీ కార్యదర్శి నరేందర్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆపీసర్ కు  చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే బాధిత ఇంటి యజమానులకు కూడా సరైన న్యాయం చేయాలని ఆయన కోరారు. *PRESS NOTE* - 2


గ్రామంలో పరిశుభ్రత - పారిశుధ్యం పాటిద్దాం

ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించి భూగర్భ జలాలను పెంచుదాం - బుగ్గారం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన స్పెషల్ ఆపీసర్ జి.సునిత  IMG-20250424-WA0009

బుగ్గారం గ్రామంలో పరిశుభ్రత - పారిశుధ్యం పాటిద్దామని, ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు నిర్మించి భూగర్భ జలాలను పెంచుదామని స్పెషల్ ఆపీసర్ జి. సునీత గురువారం బుగ్గారం గ్రామ ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఆమె అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభకు హాజరైన ప్రజలతో, వివిధ శాఖల సిబ్బంది, మహిళా సమైక్య గ్రూప్ లతో కలిసి ముందుగా పరిశుభ్రత - పారిశుధ్యం, నీటి పొదుపు, ఇంకుడు గుంతల ఆవశ్యకత, మరుగు దొడ్ల నిర్మాణం తదితర ముఖ్య అంశాలతో కూడిన విషయాలను ప్రజల నోటితో అనిపిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామ సభలో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, అంగన్ వాడీ టీచర్లతో కూడా ప్రత్యేకంగా చర్చలు జరిపారు.
 గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామం లోని వీధి లైట్లు, మురికి కాలువలను, రోడ్ల ను ఆమె ప్రత్యేకంగా తిరిగి పరిశీలించారు.  గ్రామ కార్యదర్శి అక్బర్ నేతృత్వంలో గ్రామ ప్రజలు, వివిధ శాఖల సిబ్బంది స్పెషల్ ఆపీసర్ జి. సునిత కు ఘన స్వాగతం పలికారు. అంజీర మొక్కను బహుమతి గా ఆమెకు అందజేస్తూ శాలువాలతో ఘనంగా సత్కరించారు. 
ఈ గ్రామ సభలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, విడిసి ఉపాధ్యక్షులు సుంకం ప్రశాంత్,  కోర్ కమిటి కో కన్వీనర్ పెద్దనవేణి రాగన్న, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు నగునూరి నర్సా గౌడ్, మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ రహమాన్, విడిసి సభ్యులు సుంకం గంగారెడ్డి, శ్రీ పేరంబూదూరి సురేందర్ స్వామి, చింతపండు మల్లయ్య, అంగన్ వాడీ టీచర్లు, ఎఎన్ఎం లు, ఆశా వర్కర్లు, మహిళా సమైక్య గ్రూప్ లీడర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు  - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు 

అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు  - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు    మెట్టుపల్లి ఏప్రిల్ 26( ప్రజా మంటలు దగ్గుల అశోక్): సమాజం లోని అన్నీ వర్గాల ప్రజలకు న్యాయ విజ్ఞానం అందించేందుకే సదస్సులు నిర్వహిస్తున్నాం అని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం మండల్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకి ఆయన ముఖ్య అతిధి గా హాజరు ఐయి...
Read More...
Local News 

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక  ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక  ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్                                            సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల ఏప్రిల్ 26(ప్రజా మంటలు)  పట్టణంలోని ఎస్ కే ఎన్ ఆర్ మైదానంలో టీచర్స్ క్రికెట్ లీగ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు విన్నర్ TCL  A టీమ్, రన్నర్ TCL B టీమ్ లకు బహుమతులు ప్రధానం చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  ఈ సందర్భంగా మాట్లాడుతూ...
Read More...
Local News 

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే  క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే  క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం  జగిత్యాల డీఎస్పీ రఘు చందర్                           సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల ఏప్రిల్ 26(ప్రజా మంటలు)సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై,     వాస్తవాలను తెలుసుకోకుండా అట్టి పోస్టులను ఫార్వర్డ్ చేసే వారిపై  క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని  డిఎస్పీ రఘు చందర్  తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రజలు అప్రమత్తంగా...
Read More...
Local News 

రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ డీలర్మృతి  

రోడ్డు ప్రమాదంలో  అబ్బాపూర్ డీలర్మృతి   అంత్యక్రియలో పాల్గొన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గొల్లపల్లి ఎప్రిల్ 26 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలంలోని అబ్బాపూర్ వాస్తవ్యులు గొల్లపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు చెవుల రవింధర్ తండ్రి  చెవుల రాజలింగయ్య  రోడ్డు ప్రమాదంలో మృతి చెందాగా శనివారం నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  పాల్గొన్నారు. ఈ...
Read More...
Local News 

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ సికింద్రాబాద్ ఏప్రిల్ 26 (ప్రజా మంటలు): జమ్ము కాశ్మీర్ పహాల్గంలో  పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఎమ్మార్పీఎస్  నాయకులు పార్శిగుట్ట లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. న్యూ అశోక్ నగర్ నుంచి  పార్శి గుట్ట చౌరస్తా అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వరకు ర్యాలీ కొనసాగింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక...
Read More...
Local News 

ప్రతి ఉద్యోగికి  పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్

ప్రతి ఉద్యోగికి  పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్                                                 సిరిసిల్ల రాజేంద్ర శర్మ     జగిత్యాల ఏప్రిల్ 25(ప్రజా మంటలు)పట్టణములోని విరూపాక్షీ ఫంక్షన్ హాల్ లో శ్రీ వాసం భీమయ్య సునీత గార్ల పదవి విరమణ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  పాల్గొని మాట్లాడుతూ  ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి అని విరమణ అనంతరం భావి జీవితంలో ఆయురారోగ్యాలతో...
Read More...
Local News 

మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న షి టీమ్,భరోసా సెంటర్

మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న షి టీమ్,భరోసా సెంటర్    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల ఏప్రిల్ 25(ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో గల నర్సింగ్ కళాశాలలో   షీ టీం, ఏ హెచ్ టి యూ, భరోసా టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు.  విద్యార్థిని విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ...
Read More...
Local News 

బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం

బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం                 సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల ఏప్రిల్ 25(ప్రజా మంటలు)జిల్లా బి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో  జిల్లా అధ్యక్షులు  కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  మరియు మాజీ జడ్పీ ఛైర్పర్సన్ శ్రీమతి  దావ వసంత సురేష్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. జమ్ము కాశ్మీర్ ఉగ్ర దాడుల్లో మరణించిన వారికి రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు...
Read More...
Local News 

సూర్య ధన్వంతరి ఆలయము లో ఘనంగా  కుంకుమ పూజలు 

సూర్య ధన్వంతరి ఆలయము లో ఘనంగా  కుంకుమ పూజలు            జగిత్యాలఏప్రిల్ 25 (ప్రజా మంటలు)    ఈ సంవత్సరము నాల్గవ శుక్రవారం  రోజున శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం నందు వెలసి యున్న మాతా ధన లక్ష్మిదేవి సేవలో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి వారి అధ్వర్యంలో కుంకుమార్చన మరియు లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేసారు . మాతలు అధిక సంఖ్య లో పాల్గొని...
Read More...
Local News 

ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా రాజారావు

ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా రాజారావు సికింద్రాబాద్ ఏప్రిల్ 25 (ప్రజామంటలు): ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా అడిషనల్ డీఎంఈ  ప్రొఫెసర్ రాజారావు నియమితులయ్యారు. ఈమేరకు ఆయన శుక్రవారం పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఇంతకు ముందు రాజారావు యాదాద్రి భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి(జీజీహెచ్) సూపరింటెండెంట్ గా వ్యవహరించారు. ప్రొ.నరేంద్రకుమార్ డీఎంఈ గా వెళ్ళడంతో ఉస్మానియా మెడికల్ కాలేజీ ఇంచార్జీ ప్రిన్సిపాల్...
Read More...
Local News 

క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో హైస్కూల్ మైదానంలో కొవ్వొత్తుల ర్యాలీ 

క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో హైస్కూల్ మైదానంలో కొవ్వొత్తుల ర్యాలీ  గొల్లపల్లి ఎప్రిల్ 25 (ప్రజా మంటలు) : కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో అమాయక హిందువులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ, గొల్లపెల్లి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో హైస్కూల్ మైదానంలో కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. హిందువులపై జరిగిన ఈ దారుణ ఉగ్రదాడికి నిరసనగా, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, మృతుల ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థనలు చేశారు. ఈ...
Read More...
Local News 

ఉగ్రవాద దాడిని నిరసిస్తూ  విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ శాఖ కొవ్వొత్తుల ర్యాలీ దిష్టిబొమ్మ దహనం

ఉగ్రవాద దాడిని నిరసిస్తూ  విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ శాఖ  కొవ్వొత్తుల ర్యాలీ దిష్టిబొమ్మ దహనం గొల్లపల్లి ఎప్రిల్ 25 (ప్రజా మంటలు): జమ్ము కాశ్మీర్ లోని పహల్గాం  దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని నిరసిస్తూ గొల్లపల్లి మండలం కేంద్రం లో  శుక్రవారము రాత్రి బస్టాండ్ నుండి ర్యాలీగా బయలుదేరి, గ్రామపంచాయతీ వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ యువకులు కొవ్వొత్తుల ర్యాలీ అనంతరం...
Read More...