సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ప్రదర్శనలు - ఎస్ఐ సిహెచ్ సతీష్
గొల్లపల్లి ఎప్రిల్ 24:(ప్రజా మంటలు)
జిల్లా ఎస్ప అశోక్ కుమార్ ఆదేశాల మేరకు గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవపట్నంలో పోలీస్ కళాబృందం వారు మూఢ నమ్మకాలు, ఆత్మహత్యల నివారణ, రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ నియమాలు, గల్ఫ్ ఏజెంట్ ల మోసాలు, సైబర్ మోసాలు,నివారణ పై అవగాహన, సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహనకల్పించారు
కార్యక్రమంలో భాగంగా గొల్లపల్లి ఎస్సై సిహెచ్ ,సతీష్, మాట్లాడుతూ ఈ మధ్యకాలం లో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్ల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని, ఎవరైనా మోసపోయినట్టైతే 1930 నంబర్ కి పిర్యాదు చేయాలని,పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని
దీని వల్ల గ్రామంలో ఏ సంఘటన జరిగిన వెంటనే తెలుస్తోంది అని తెలిపారు, సిసి కెమెరాలు ఏర్పాటు సహకరించలని గ్రామస్థులను కోరారు.తల్లిదండ్రులు పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని అన్నారు.
యువత చెడు వ్యసనాలకుఅలవాటు పడకూడదని, ప్రభుత్వం ,పోలీస్ తరపున అన్ని విధాల సహాయహకారులు ఉంటాయని అన్నారు. వాహన దారులు తాగి డ్రైవింగ్ చేయవద్దని, లైసెన్స్ లేకుండ వాహనాలు నడపవద్దని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ఆవశ్యకత గురించి వివరించారు.
గ్రామాల్లో అనుమానస్పదంగా వ్యక్తులు కనపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు వున్న పోలీస్ స్టేషన్ కు తెలియపరచాలని తెలిపారు. గ్రామంలో చిన్న చిన్న తగాదాలకు పోయి జీవితం నాశనము చేసుకొవద్దని, నేరరహిత గ్రామాలుగ చేయడానికి ప్రజలు కృషి చేయాలనీ సూచించారు. మంత్రాలు తత్రాలు ముడనమ్మకాలు నమ్మవద్దని, గ్రామాల్లో ఏ సమ్యస వున్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలుపాలన్నారు,లేదా 100 నెంబర్ కు ఫోన్ చేస్తే నిమిషాల్లో పోలీసులు తమ వద్దకు వస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కళాబృందం కమలేష్, గడ్డం రమేష్ ,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
నూతన ఆర్ఓఆర్ చట్టంపై జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ డీలర్మృతి

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్

మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న షి టీమ్,భరోసా సెంటర్

బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం

సూర్య ధన్వంతరి ఆలయము లో ఘనంగా కుంకుమ పూజలు

ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా రాజారావు

క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో హైస్కూల్ మైదానంలో కొవ్వొత్తుల ర్యాలీ
