వరకట్న దాహానికి మరో యువతి బలి - కొడిమ్యాలలో బుగ్గారం అమ్మాయి దారుణ హత్య..?
పోలీసుల అదుపులో హంతకులు...?
బుగ్గారం/ కోడిమ్యాల ఏప్రిల్ 23:
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన కొమ్ము జమున అనే యువతి, కొడిమ్యాలలో వరకట్న దాహానికి బలైంది. గత ఏడాది క్రితం కొమ్ము జమున (అలియాస్ దుబ్బాక జమున) ను కోడిమ్యాల మండల కేంద్రానికి చెందిన దుబ్బాక రాహుల్ కు ఇచ్చి పెండ్లి చేశారు.
పెండ్లి సమయంలో లాంఛనాల ప్రకారం సామాగ్రితో పాటు లక్షల్లో వరకట్నం కూడా ముట్ట చెప్పారు. అయినా అదనపు వరకట్నం పేరుతో తరచుగా జమునను పలు సార్లు వేధించారు. అంతే కాకుండా జమున భర్త రాహుల్ కు అక్రమ సంబంధాలు ఉన్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వరకట్న హత్యకు గురైన జమున మృత దేహానికి బుధవారం జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహించారు. బుధ వారం సాయంత్రం బుగ్గారంలో జమున మృత దేహంతో అంతిమ యాత్ర నిర్వహించి దహన సంస్కారాలు చేశారు. జమున తల్లి కొమ్ము పోసవ్వ తల కొరివి పెట్టారు.
కోడిమ్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల డీఎస్పీ డి.రఘు చందర్, మల్యాల సిఐ నీలం రవి, కొడిమ్యాల ఎస్సై సందీప్ లు ప్రత్యక్షంగా హాజరై జమున హత్య కేసును శోధిస్తూ జమున హత్యకు గల బలమైన కారణాల కోసం పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. జమున భర్త రాహుల్ తో పాటు అత్త - మామలను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
నూతన ఆర్ఓఆర్ చట్టంపై జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ డీలర్మృతి

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్

మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న షి టీమ్,భరోసా సెంటర్

బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం

సూర్య ధన్వంతరి ఆలయము లో ఘనంగా కుంకుమ పూజలు

ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా రాజారావు

క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో హైస్కూల్ మైదానంలో కొవ్వొత్తుల ర్యాలీ
