రాహుల్,సోనియా లపై ఈడి చార్జి షీట్రె పై రేవంత్ రెడ్డి స్పందించక పోవడానికి కారణం ఏమిటి? ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఖమ్మం ఏప్రిల్ 20:
ఖమ్మం జిల్లా పర్యటనలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
*కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ల పై ఈడీ కేసు నమోదు చేస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది... కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కనీసం స్పందించలేదు*
ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి తో పాటు ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ కూడా వడగండ్ల వాన వల్ల జరిగిన పంట నష్టం పై సమీక్షించలేదు
రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యం తడిసిపోయి, మామిడి పూత రాలిపోయి రైతులు కష్టాల్లో ఉంటే కనీసం సమీక్షించే తీరికలే ప్రభుత్వానికి లేదా అని ఆమె ప్రశ్నించారు.
రైతులను పలకరించిన పాపాన పోలేదు... ఇంతటి దౌర్భాగ్యమైన స్థితి ఎప్పుడూ లేదు*.జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షాలపై కనీసం రెవెన్యూ అధికారులతో కూడా మాట్లాడలేదు.
రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా పడకేసింది
వర్షాల వల్ల పంట నష్టపోయిన ప్రతి ఎకరానికి రూ 20 వేలు నష్టపరిహారం చెల్లించాలి. మంత్రులు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించుకునే ప్రయత్నం చేయడం తప్ప ప్రజల సమస్యల గురించి పట్టించుకోవడం లేదు
కమ్యూనిస్టు పార్టీలో కూడా ప్రభుత్వాన్ని నిలదీయకపోవడం దారుణం.ప్రభుత్వ ఆస్పత్రులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయి... ప్రజలు వెళ్లాలంటేనే భయపడుతున్నార
రైతు భరోసా సగం మందికి రానేలేదు
రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేశామని ప్రభుత్వం అబద్ధాలు చెబుతున్నది .60 శాతం మందికి రుణమాఫీ కాలేదు .రైతు కూలీలకు ఇస్తామన్న ఆత్మీయ భరోసా డబ్బులు ఇవ్వనేలేదుపథకాలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయి.
ఇది మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని తేలిపోయింది .కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మన్ననలను కోల్పోయింది
తెలంగాణ రాష్ట్రం తిరోగమన దిశలో పయనిస్తున్నది.ఎక్కడికక్కడ ప్రభుత్వ పెద్దలను, కాంగ్రెస్ నాయకులను నిలదీయండి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే భక్త రామదాసు ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించి 60 వేల ఎకరాలకు నీళ్లు అందించారు .కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ఒక కొత్త ప్రాజెక్టు చేపట్టలేదు
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలనీ కవిత ప్రజలను కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బొటానికల్ టూర్.

పహల్గాం దాడిని నిరసిస్తూ సీసీ నగర్ లో ర్యాలీ

బ్రెయిన్ ట్యూమర్ పేషంట్లకు ఎండోస్కోపిక్ విధానం ఓ వరం

ఉగ్రవాద పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలి.

పహల్గాం దాడికి నిరసనగా ఆటోడ్రైవర్ల నిరసన

నూతన ఆర్ఓఆర్ చట్టంపై జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ డీలర్ మృతి

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్
