బ్రెయిన్ ట్యూమర్ పేషంట్లకు ఎండోస్కోపిక్ విధానం ఓ వరం
రాష్ర్ట ఆరోగ్య శాఖ కార్యదర్శి డా.క్రిస్టినా జెడ్ చోంగ్తు
యశోదా హాస్పిటల్ లో స్కల్ బేస్ ఎండోస్కోపి సమ్మిట్
సికింద్రాబాద్ ఏప్రిల్ 26 (ప్రజామంటలు) :
తెలుగు రాష్ర్టాలలో బ్రెయిన్ ట్యూమర్ రోగులకు న్యూరో ఎండోస్కోపిక్ , ఎండోస్కోపీ ద్వారా నిర్వహించబడే నాడీ సంబందిత బ్రెయిన్ సర్జరీలకు యశోద హాస్పిటల్స్ భారతదేశంలోనే మొటమొదటి రోబోటిక్ న్యూరో సర్జరీ ఆండ్ న్యూరో ఎండోస్కోపిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఒక చక్కని వేధిక అవుందని తెలంగాణ రాష్ర్ట ఆరోగ్య శాఖ కార్యదర్శి డా.క్రిస్టినా జెడ్ చోంగ్తు అన్నారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ లో నిర్వహిస్తున్న రెండు రోజుల స్కల్ బేస్ ఎండోస్కోపీ సమ్మిట్–2025 ను శనివారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మెదడు, వెన్నముక శస్ర్త చికిత్సలలో న్యూరో ఎండోస్కోప్ గత రెండు దశాబ్దాలలో గణనీయమైన పురోగతిని సాధించిందని, దాని మినిమల్లీ ఇన్యాసివ్ (అతి తక్కువ కోత) విధానం, హై రిజల్యూషన్, వ్యాధిని పూర్తిగా తగ్గించే సామర్ద్యం, రోగి త్వరగా కోలుకోవడం వంటివి ఈ అత్యాధునిక రోబోటిక్ న్యూరో సర్జరీ ఆండ్ న్యూరో ఎండోస్కోపీ సర్జరీల యొక్క ప్రత్యేకతలు అవని ఆమె పేర్కొన్నారు.
యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరో సర్జన్ ఆండ్ స్కల్ బేస్ ఎండోస్కోపి సమ్మిట్ కన్వీనర్, డాక్టర్ ఆర్.అయ్యదురై మాట్లాడుతూ..ఈ సమ్మిట్ భారతదేశంలోనే న్యూరో సర్జరీ రంగంలో నిర్వహించబడిన మొట్టమొదటి అంతర్జాతీయ స్కల్ బేస్ ఎండోస్కోపి సమ్మిట్ లైవ్ వర్క్ షాప్ అని అన్నారు. వైద్య రంగంలో రోబోటిక్ సహాయం ఒక గొప్ప వరంలా మిగిలిపోతుందన్నారు.
ముఖ్యంగా మెదడు సర్జరీల కోసం ఉద్దేశించిన రోబోటిక్ వ్యవస్థ చాలా సున్నితమైనదని, ఇది శస్ర్తచికిత్స యొక్క భద్రతను అసమానమైన స్థాయికి పెంచుతుదన్నారు.యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, యూనిట్ హెడ్ డాక్టర్ విజయ్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఈ సమ్మిట్ లో పలువురు డాక్టర్లు, ఆయా విభాగాల వైద్య నిపుణులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బొటానికల్ టూర్.

పహల్గాం దాడిని నిరసిస్తూ సీసీ నగర్ లో ర్యాలీ

బ్రెయిన్ ట్యూమర్ పేషంట్లకు ఎండోస్కోపిక్ విధానం ఓ వరం

ఉగ్రవాద పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలి.

పహల్గాం దాడికి నిరసనగా ఆటోడ్రైవర్ల నిరసన

నూతన ఆర్ఓఆర్ చట్టంపై జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ డీలర్ మృతి

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్
