ఉగ్రవాద పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలి.
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 26(ప్రజా మంటలు)
జగిత్యాల మహిళ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పహెల్గాం మృతులకు నివాళి.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలుచేస్తున్న పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలని మహిళా ఐక్యవేదిక సభ్యులు డిమాండ్ చేశారు. హిందువులనే లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్లో నిరాయుదులైన అమాయక యాత్రికులపై దాడి చేసి నరమేధాన్ని సృష్టించడాన్ని నిరసిస్తూ జగిత్యాల మహిళ ఐక్యవేదిక ఆధ్వర్యంలో తహసిల్ చౌరస్తా వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మహిళ నేతలు మాట్లాడుతూ ఉగ్రవాదులు అత్యంత దారుణంగా భార్యల ముందు భర్తలను, పిల్లల ముందు తండ్రులను వారి గుర్తింపు అడిగి పాశ వికంగా హత్య చేయడం మహిళా లోకాన్ని తీవ్రంగా కలచి వేసిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రవాద పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేస్తేనే భారత్ లో శాంతి నెలకొంటుందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ చర్య కైన యావత్ మహిళా లోకం మద్దతు ఇస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు భీమనాతిని ఉమాదేవి, మీనాక్షి, సింగం పద్మ, మాధవి, లక్ష్మి, మమత, సుజాత తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బొటానికల్ టూర్.

పహల్గాం దాడిని నిరసిస్తూ సీసీ నగర్ లో ర్యాలీ

బ్రెయిన్ ట్యూమర్ పేషంట్లకు ఎండోస్కోపిక్ విధానం ఓ వరం

ఉగ్రవాద పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలి.

పహల్గాం దాడికి నిరసనగా ఆటోడ్రైవర్ల నిరసన

నూతన ఆర్ఓఆర్ చట్టంపై జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ డీలర్ మృతి

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్
