13 లక్షల 50వేలతో సైన్స్ ల్యాబ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 23( ప్రజా మంటలు)
పట్టణ గర్ల్స్ హైస్కూల్లో పీఎం శ్రీ నిధులు 13 లక్షల 50వేలతో సైన్స్ ల్యాబ్ భవన నిర్మాణానికి బుధవారం 11 గంటలకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్.
ఈసందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెరగాలని శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలన్నారు.
నేటి పరిస్థితుల్లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం ఇతర దేశాలపై ఆధారపడకుండా ఈ దేశానికి అవసరమైన సాంకేతిక పరమైన విజ్ఞానాన్ని మరియు వస్తువులను తయారు చేసుకోవడానికి ఇక్కడే ప్రయత్నం జరగాలన్న ప్రధాని మోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలతో విద్యార్థులు ఈ సైన్స్ ల్యాబ్ లను వినియోగించుకొని భావిశాస్త్రవేత్తలు గా తయారు కావాలని ఆకాంక్షించారు
ఈ ప్రాంత విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని ఏ సమస్య తన దృష్టికి వచ్చిన వెనువెంటనే తీర్చే ప్రయత్నం చేస్తానని ప్రభుత్వ విద్యాభివృద్ధికి తగు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నానని అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాము నాయక్, యంఈఓ భీమయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ లైబ్రరీ డైరెక్టర్ సుధాకర్, డిష్ జగన్, తోట మల్లికార్జున్, క్యాదసు నవీన్, మేక పవన్, హెడ్ మాస్టర్ రామానుజం, ఏ ఈ ధనుంజయ్, ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆనంద్ రావు, బోనగిరి దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ డీలర్మృతి

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్

మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న షి టీమ్,భరోసా సెంటర్

బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం

సూర్య ధన్వంతరి ఆలయము లో ఘనంగా కుంకుమ పూజలు

ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా రాజారావు

క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో హైస్కూల్ మైదానంలో కొవ్వొత్తుల ర్యాలీ

ఉగ్రవాద దాడిని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ శాఖ కొవ్వొత్తుల ర్యాలీ దిష్టిబొమ్మ దహనం
