నిబద్దతతో చేసిన పనులే అధికారులకు గుర్తింపునిస్తాయి.. *పదవి విరమణ చేసిన తహసీల్దార్ ఎస్.అశోక్ కుమార్

On
నిబద్దతతో చేసిన పనులే అధికారులకు గుర్తింపునిస్తాయి.. *పదవి విరమణ చేసిన తహసీల్దార్ ఎస్.అశోక్ కుమార్

సికింద్రాబాద్ ఏప్రిల్29 (ప్రజా మంటలు):

కంటోన్మెంట్ నియోజకవర్గం హైదరాబాదు రెవెన్యూ పరిధిలోని తిరుమలగిరి తాహసీల్దార్ ఎస్.అశోక్ కుమార్ పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది.  తిరుమలగిరి పల్లవి స్కూల్ లో నిర్వహించిన అభినందన సభకు  ముఖ్య అతిథులు గా ప్రత్యేక (ఎస్ హెచ్ ఓ) రెవెన్యూ కలెక్టర్ అపర్ణ, హైదరాబాద్  డిస్ట్రిక్ట్ రెవెన్యూ  అధికారి (డిఆర్ఓ) వెంకట చారి,హెచ్ఎండిఏ ఓఎస్డి మనోహర్, సికింద్రాబాద్ ఆర్డీవో పి.సాయిరాం,హైదరాబాద్ ఆర్టీవో రామకృష్ణ,మారేడ్ పల్లి తాసిల్దార్ భూమయ్య, సికింద్రాబాద్ తాసిల్దార్  పాండునాయక్, హిమత్ నగర్ తాసిల్దార్, మాజీ తాసిల్దార్ శ్రీనివాసరావు,జ్యోతి లు హజరయ్యారు.  తహసిల్దార్ ఎస్ ఉమా అశోక్ కుమార్ దంపతులను శాలువా, గజ పూలమాలుతో సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎస్.అశోక్ కుమార్ తన పదవీ కాలంలో నీతి, నిజాయితీ తో పనిచేశారని,ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మంచి పేరు సంపాదించుకున్నారని పలువురు అభినందించారు. 31 సంవత్సరాల రెండు నెలల పాటు ఉద్యోగబాధ్యతలు నిర్వహించిన ఎస్ అశోక్ కుమార్ పదవీ విరమణ తరువాత జీవితాన్ని ఆరోగ్యంగా కుటుంబంతో సంతోషంగా గడపాలని పలువురు ఉన్నతాధికారులు ఉద్యోగులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోపలు మండలాల తహాసిల్దారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

వాలిబాల్  వేసవి ఉచిత శిక్షణ శిబిరం  ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి. కోచ్  తాండ్ర పవన్

వాలిబాల్  వేసవి ఉచిత శిక్షణ శిబిరం   ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి. కోచ్  తాండ్ర పవన్ గొల్లపల్లి  ఏప్రిల్ 29 (ప్రజా మంటలు): గొల్లపల్లి  మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ లో  తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ రూపొందించిన కార్యాచరణలో భాగంగా రాష్ట్ర యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో మే 1వ తేది నుండి మే 31వ తేదీ వరకు ఉచిత శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు వాలీబాల్ కోచ్ తాండ్ర పవన్...
Read More...
Local News 

నిబద్దతతో చేసిన పనులే అధికారులకు గుర్తింపునిస్తాయి.. *పదవి విరమణ చేసిన తహసీల్దార్ ఎస్.అశోక్ కుమార్

నిబద్దతతో చేసిన పనులే అధికారులకు గుర్తింపునిస్తాయి.. *పదవి విరమణ చేసిన తహసీల్దార్ ఎస్.అశోక్ కుమార్ సికింద్రాబాద్ ఏప్రిల్29 (ప్రజా మంటలు): కంటోన్మెంట్ నియోజకవర్గం హైదరాబాదు రెవెన్యూ పరిధిలోని తిరుమలగిరి తాహసీల్దార్ ఎస్.అశోక్ కుమార్ పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది.  తిరుమలగిరి పల్లవి స్కూల్ లో నిర్వహించిన అభినందన సభకు  ముఖ్య అతిథులు గా ప్రత్యేక (ఎస్ హెచ్ ఓ) రెవెన్యూ కలెక్టర్ అపర్ణ, హైదరాబాద్  డిస్ట్రిక్ట్ రెవెన్యూ...
Read More...
Local News  State News 

మండు టెండలో రోడ్డుపై పాకుతూ.. కూటి కోసం ఓ యాచకుడి నరకయాతన

మండు టెండలో రోడ్డుపై పాకుతూ.. కూటి కోసం ఓ యాచకుడి నరకయాతన సికింద్రాబాద్, ఏప్రిల్ 29 ( ప్రజామంటలు): కొద్దిరోజులుగా ఎండలు అగ్ని గుండాన్ని తలపిస్తున్నాయి. ఉదయం 8 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండగా పగటి వేళ ఎండల కొలిమికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి ఓపీ బ్లాక్ వద్ద మంగళవారం  మధ్యాహ్నం వేళ ఓ వృద్దుడు చాలీచాలని బట్టలతో మండుటెండలో బిక్షం...
Read More...
Local News 

శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కు అందజేత

శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కు అందజేత                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల ఏప్రిల్ 29 (ప్రజా మంటలు)  పట్టణములోని శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం లో శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన వేణుగోపాలస్వామి వారి పంచాహనిక ధ్వజారోహణ తిరుకల్యాన బ్రహ్మోత్సవ ఆహ్వానం పత్రికను తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ని వారి
Read More...
Local News 

భూ భారతి చట్టంతో సాదా బైనామాలకు పరిష్కారం.....జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

భూ భారతి చట్టంతో సాదా బైనామాలకు పరిష్కారం.....జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్                                  సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూ దార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక   రాయికల్ మండల కేంద్రంలో   పద్మశాలి కళ్యాణ ఫంక్షన్ హాల్  వద్ద నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్రాయికల్, ఏప్రిల్ -29(ప్రజా మంటలు) భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన...
Read More...
Local News  State News 

రాయబారేలిలో విశాఖ ఇండస్ట్రీస్ ఆటమ్ సోలార్ రూఫ్ ప్రారంభం 

రాయబారేలిలో విశాఖ ఇండస్ట్రీస్ ఆటమ్ సోలార్ రూఫ్ ప్రారంభం  సికింద్రాబాద్ ఏప్రిల్ 29 (ప్రజామంటలు)::పునరుత్పాదక ఇంధన రంగాన్ని పురోగమింపజేసే దిశగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం రాయ్‌బరేలీలో విశాకా ఇండస్ట్రీస్ రూపొందించిన ఆటమ్ సోలార్ రూఫ్ ను అధికారికంగా ప్రారంభించినట్లు కంపెనీ ప్రతినిధులు హైదరాబాదులో మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమం భారతదేశంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మరియు గ్రీన్ మోబిలిటీ పరిష్కారాలను...
Read More...
Local News 

తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్  రెండవ విలన్ బి ఆర్ ఎస్.

తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్  రెండవ విలన్ బి ఆర్ ఎస్.   బిజేపీ నాయకురాలు ఎం. రాజేశ్వరి సికింద్రాబాద్ ఏప్రిల్ 29 (ప్రజా మంటలు):    2001లో ఏర్పడిన టీఆరెఎస్ పార్టీ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో, కేంద్రంలో అధికారాన్ని పంచుకొని తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు మొదటి విలన్ అయితే టిఆర్ఎస్ పార్టీ
Read More...
Local News 

ఘనంగా హరిహరాలయ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం

ఘనంగా హరిహరాలయ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం                       సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల ఏప్రిల్ 28(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ మీది హరిహరాలయంలో ఆలయానికి సంబంధించి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు.  అధ్యక్షులుగా చాకుంట వేణుమాధవరావు, ఉపాధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్ చారి ,కార్యదర్శి రుద్రాంగి రాఘవేంద్ర శర్మ ,కోశాధికారి మేడిపల్లి శ్రీనివాస్ శర్మ, ప్రచార కార్యదర్శి కొత్తపెల్లి శ్రీనివాస్ శర్మ...
Read More...
Local News 

నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్

నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్ *ప్రారంభించిన యూఎస్ఏ కాన్సులెట్ జనరల్   సికింద్రాబాద్ ఏప్రిల్ 28 (ప్రజామంటలు) : చిన్న వయస్సులోనే తన గొప్ప ఆలోచనకు కార్యరూపాన్ని ఇచ్చి, వరసగా ఓపెన్ లైబ్రరీలు ప్రారంభిస్తున్న చిన్నారి స్టూడెంట్ ఆకర్షణ నేటి తరానికి ఆదర్శంగా నిలిచిందని హైదరాబాద్ లోని యూఎస్ఏ కాన్సులెట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ అన్నారు. సోమవారం దమ్మాయిగూడ లోని జవహార్ నగర్...
Read More...
Local News 

పహాల్గమ్ " ఉగ్రదాడి తీవ్ర విచారకరం *తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్ 

పహాల్గమ్ సికింద్రాబాద్ ఏప్రిల్ 28 ( ప్రజామంటలు): జమ్మూ కాశ్మీర్ లోని "పహాల్గం" లో జరిగిన ఉగ్రదాడిని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ విభాగం, జుడా, టి .యన్.జి .ఓ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించారు. దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.అనంతరం ర్యాలీ...
Read More...
Local News  Spiritual  

కళ్యాణం కమనీయం ...వెంకన్న కళ్యాణం..బోయగూడలో..

కళ్యాణం కమనీయం ...వెంకన్న కళ్యాణం..బోయగూడలో.. సికింద్రాబాద్, ఏప్రిల్ 28 (ప్రజా మంటలు): సికింద్రాబాద్ బోయగూడా వై జంక్షన్ వద్ద ఎం ఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టు అపార్ట్మెంట్  లో శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులు కే వీ రమణ రావు, లలిత దంపతులు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మూడు...
Read More...
National  State News 

మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు

మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు హైదరాబాద్ ఏప్రిల్ 28:   మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని శాంతి చర్చల కమిటీ కలిసి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి  గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం కలిగిన జానారెడ్డితో భేటీ అయ్యారు.ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కె. జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే.    
Read More...