భూ భారతి చట్టంతో సాదా బైనామాలకు పరిష్కారం.....జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూ దార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక
రాయికల్ మండల కేంద్రంలో పద్మశాలి కళ్యాణ ఫంక్షన్ హాల్ వద్ద నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
రాయికల్, ఏప్రిల్ -29(ప్రజా మంటలు)
భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్వోఆర్ భూ భారతి చట్టం ద్వారా సాదా బైనామా దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు.
రాయికల్ మండలం లోని పద్మశాలి కళ్యాణ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్* జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు.
భూ భారతి చట్టం లోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ తెల్ల కాగితాల పై కొనుగోలు చేసిన సాధా బైనామా భూముల పట్టాలు అందించాలని గత ప్రభుత్వం తీసుకున్న దరఖాస్తుల పరిష్కారం పై ధరణిలో అవకాశం లేనందున హై కోర్టు స్టే విధించిందని, పెండింగ్ సాధా బైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టం సెక్షన్ 6 క్రింద ఆర్డిఓ లకు బాధ్యతలు అందించిందని అన్నారు.
చిన్న సన్న కారు రైతులు 2014 కంటే ముందు కొనుగోలు చేసిన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు మాత్రమే సాధా బైనామా పట్టా లభిస్తుందని అన్నారు. గడిచిన 12 ఏళ్ళలో సాధా బైనామా భూముల అనుభవంలో ఉన్న వారికి మాత్రమే దరఖాస్తులు పరిష్కారం అవుతాయని అన్నారు.
భూ భారతి చట్టం ద్వారా పక్కగా భూ సరిహద్దులు నిర్ణయిస్తారని, రైతులకు, భూ హక్కుదారులకు ఉచిత న్యాయ సాయం అందుబాటులో ఉంటుందని అన్నారు. భూ భారతి చట్టం ప్రకారం అధికారులు అందించిన ఆర్డర్ల పై సంతృప్తి చెందకుంటే బాధితులు అప్పిల్ చేసుకునే అవకాశం ఉందని అన్నారు.
వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కుల సంక్రమిస్తే తహసిల్దార్ విచారణ జరిపి రికార్డుల్లో మ్యూటేషన్ చేస్తారని, నిర్ణీత గడువు 30 రోజుల లోగా మ్యూటేషన్ పూర్తి చేయకుంటే ఆటోమేటిక్ గా మ్యూటేషన్ జరుగుతుందన్నారు.
భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపించి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందన్నారు. భూముల విస్తీర్ణం మార్పులు చేర్పులకు అవకాశం ఉందని తెలిపారు. భవిష్యత్తులో మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్లు భూమికి భూ దార్ కార్డు అందించడం జరుగుతుందని అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల.ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వ్యవస్థ వల్ల ఇబ్బంది పడని రైతు ఎవరూ లేరని అన్నారు. 15 నెలల నుంచి క్షుణ్ణంగా అధ్యయనం చేసి పేద ప్రజలకు న్యాయం జరిగేలా భూ భారతి చట్టం ప్రవేశ పెట్టారని అన్నారు.భూ భారతి చట్టం ప్రవేశం పెట్టడమే కాకుండా అధికారులను గ్రామాలకు పంపి భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం లో రైతులు పండించిన సన్న ధాన్యం కు నేడు యాసంగి సీజన్ లో కూడా ప్రభుత్వం క్వింటాల్ వడ్లకు 500 రూపాయల బోనస్ అందిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల రెవెన్యూ డివిజన్ అధికారి
పి మధుసూదన్ రాయికల్ తహసిల్దార్ అబ్దుల్ ఖయ్యూం ఎంపీడీవో చిరంజీవి మున్సిపల్ కమిషనర్ మనోహర్ ఏ ఎం సి .మార్కెట్ చైర్మన్, రైతులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వాలిబాల్ వేసవి ఉచిత శిక్షణ శిబిరం ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి. కోచ్ తాండ్ర పవన్
1.jpeg)
నిబద్దతతో చేసిన పనులే అధికారులకు గుర్తింపునిస్తాయి.. *పదవి విరమణ చేసిన తహసీల్దార్ ఎస్.అశోక్ కుమార్

మండు టెండలో రోడ్డుపై పాకుతూ.. కూటి కోసం ఓ యాచకుడి నరకయాతన

శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కు అందజేత

భూ భారతి చట్టంతో సాదా బైనామాలకు పరిష్కారం.....జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

రాయబారేలిలో విశాఖ ఇండస్ట్రీస్ ఆటమ్ సోలార్ రూఫ్ ప్రారంభం

తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ రెండవ విలన్ బి ఆర్ ఎస్.

ఘనంగా హరిహరాలయ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం

నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్

పహాల్గమ్ " ఉగ్రదాడి తీవ్ర విచారకరం *తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్

కళ్యాణం కమనీయం ...వెంకన్న కళ్యాణం..బోయగూడలో..
.jpg)
మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు
