భారత సురక్ష సమితి ఆధ్వర్యంలో మోడీ యోగి చిత్ర పటాలకు పాలాభిషేకం.
జగిత్యాల మార్చి 1 (ప్రజా మంటలు) ప్రయాగ్ రాజ్ కుంభమేళాను విజయవంతం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ,యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిత్రపటాలకు భారత సురక్ష సమితి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 6 గంటలకు. పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సామాజిక సమరసత వేదిక జిల్లా అధ్యక్షుడు చిట్ల గంగాధర్ మాట్లాడుతూ 143 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ ప్రయాగరాజ్ కుంభమేళాకు అద్భుతమైన సౌకర్యాలు కల్పించి విజయవంతం చేసేందుకు కృషిచేసిన నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్ లు కారణజన్ములని కొనియాడారు. హిందూ ధర్మ రక్షణకు నిరంతరం కృషి చేస్తూ భవిష్యత్తులో సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న మహనీయులని అన్నారు. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా ఒక కొత్త నగరాన్ని సృష్టించి కుంభమేళాకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించడంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కృషి అమోఘమని అన్నారు. సుమారు 66 కోట్ల మంది భక్తులు కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించారని ఇది ప్రపంచ రికార్డు అని అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భద్రతా చర్యలు చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏ సి ఎస్ రాజు, పుప్పాల సత్యనారాయణ, చిట్ల గంగాధర్,వేముల పోచమల్లు, నరెందుల శ్రీనివాస్, బాషెట్టీ ప్రభాకర్,వేముల దేవరజo, ఎడమల వెంకట్ రెడ్డి, కస్తూరి లక్ష్మా రెడ్డి, తూనికి అంజన్న, గాధాసు భుమన్న, రాపర్తి రవి, సిరిపురం గంగారాం, బండారి మల్లికార్జున్, బోగ దేవన్న, కొత్తకొండ బాలన్న, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
