ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా ఇంటర్ విద్యాధికారి నారాయణ
జగిత్యాల ఫిబ్రవరి 28 (ప్రజా మంటలు)
ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి నారాయణ అన్నారు.
ఈనెల 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలో డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, చీఫ్ సూపరిండెంట్ లతో నిర్వహించిన ఇంటర్ పరీక్షల సన్నాహక సమావేశంలో నారాయణ పాల్గొని మాట్లాడారు. ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. జిల్లాల మొత్తం 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అందులో 13 ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ,14 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఒక్కటి మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 7073 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 7,377 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మార్చి 5వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని పరీక్ష కేంద్రాల వద్ద తగిన వసతులు కల్పించాలని సూచించారు. ఉదయం 8:30 గంటలకు పరీక్ష కేంద్రాల వద్దకు విద్యార్థులు చేరుకోవాలని తెలిపారు. ఏ లాంటి ప్రింటెడ్ మెటీరియల్ మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబడవన్నారు. విద్యార్థులు పరీక్షల విషయంలో ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్న టెలి మానస్ 14416 కాల్ చేసి నివృత్తి చేసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో డిస్ట్రిక్ట్ ఇంటర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబరు 94403 81 255, 8500470642 లకు కాల్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్ పరీక్షల విభాగం అధికారులు కొక్కుల. గంగాధర్, రమేష్ బాబు, వంగల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
