అఖిల భారత విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో భారత్. క్రీడా ఉత్స్వ్ 2025
జగిత్యాల జనవరి 21 (ప్రజా మంటలు )
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జగిత్యాల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతులను పురస్కరించుకొని
మంగళవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు ఘనంగా క్రీడోత్సవాలు స్థానిక మినీ స్టేడియంలో ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబీవీపీ పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నల్ దాస్ మురళి ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్ పిల్లల వైద్య నిపుణులు గుండేటి అర్జున్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ జయంతులను పురస్కరించుకొని వారి అడుగుజాడల్లో నడుస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని యువకులు శారీరకంగా, మానసికంగా దృఢమవ్వాలనే నిశ్చయంతో ఏబీవీపీ ఖేలో భారత్ క్రీడోత్సవ్ 2025 తో ప్రతి విద్యార్థి గ్రౌండ్ బాట పట్టే విధంగా విద్యార్థి పరిషత్ ఆలోచిస్తుందన్నారు.
ప్రస్తుత సమాజంలో కార్పొరేట్ విద్యతో విద్యార్థులంతా చదువుల వత్తిడి వల్ల గ్రౌండ్ కి ఆమెడ దూరం ఉంటున్న వైనం కానీ ప్రతి విద్యార్థికి చదువు ఎంత అవసరమో శారీరక శ్రమ కూడ అంతే అవసరం అన్నారు.
వివేకానంద చెప్పినట్టు ఉక్కు నరాలు వజ్ర కండరాల యువకులు కేవలం మైదానాల్లో నిర్మించబడతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ మడవేణి సునీల్ , ఖేల్ కన్వీనర్ నందు , రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజు నిఖిల్ , విష్ణు, జస్వంత్, రోషన్ , సిద్దు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.