ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా  సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలి

On

20250120_171844
ఎస్పీ అశోక్ 
 జగిత్యాల జనవరి 20(  ప్రజా మంటలు  )
జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా  వ్యాప్తంగా  ఉన్న  వివిధ బ్యాంకుల్లో పని చేస్తున్న బ్యాంకు అధికారులతో  బ్యాంకుల, ఏటీఎంల  వద్ద భద్రతా ప్రమాణాలు, సిసి కెమెరాల ఏర్పాటు, ఆర్థిక నేరాలు, గతంలో   జరిగిన బ్యాంకు మరియు ఏటీఎం సంబందించిన నేరాల గురించి, భవిష్యత్తు లో తీసుకోవలసిన భద్రత ఏర్పాట్లు, తీసుకోవలసిన జాగ్రత్తలపై, తదితర అంశాలపై సమావేశం నిర్వహించడం జరిగింది. 

 

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ... జిల్లా పరిధి లొపు 129 బ్యాంకు లు, సుమారు 90 ఎటిఎం  సెంటర్స్ లను గుర్తించడం జరిందని అన్నారు. బ్యాంకులు, ఎటిఎంల వద్ద పాటించాల్సిన భద్రతా ప్రమాణాలు బ్యాంకుల వద్ద భద్రతా ప్రమాణాలు తూచ తప్పకుండా పాటించాలని, ఎటిఎం కేంద్రాల వద్ద కచ్చితంగా గార్డును నియమించాలని సూచించారు.

ప్రతి బ్యాంకు, ఎటిఎం ల వద్ద నిరంతరం సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దాదాపు బ్యాంకులు, ఏటీఎంలలో అధిక నాణ్యత లేని సీసీ కెమెరాలు ఉన్నాయని, చాలా బ్యాంకుల వద్ద  సెక్యూరిటీ గార్డులు లేరని ఈ సమావేశం అనంతరం అన్ని ఎటిఎంలలో, బ్యాంకులలో అలారం సిస్టమ్‌లతో పాటు సిసిటివి కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.బ్యాంక్, ఏ టి ఎం ల వద్ద ఏదైనా అనుకోని సంఘటన జరిగిన సమయంలో  సిబ్బంది ఎలా ప్రతిస్పందించాలో  దాని పై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. లోపలికి వచ్చే వ్యక్తులను తనిఖీ చేయడానికి  గార్డు ను బ్యాంకు ప్రవేశ ద్వారం నియమించాలని సూచించారు.

.సెక్యూరిటీ గార్డును బ్యాంక్ లేదా సెక్యూరిటీ ఏజెన్సీ నియమించినప్పటికీ, అతని వ్యక్తిగత సమాచారం యొక్క పూర్తి రికార్డు, అతని ఫోటోతో పాటు, బ్యాంక్ వద్ద ఉంచాలని సూచించారు. కొత్తగా నియమితులైన వారు లేదా తాత్కాలిక ప్రాతిపదికన నియమించబడిన వారి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చాలా నేరాలలో నిందితులు సీసీటీవీ  లపై  స్ప్రే చేసి సిసిటివిలు పని చేకుండా చేసి దొంగతనాలకు పాల్పడుతారు. అదేవిధంగా  డి వి ఆర్ లను దొంగిలించి నాశనం చేయడం చేస్తారు కావున  డి వి ఆర్ లను కనిపించేలాగా కాకుండా  సీక్రెట్ ప్రాంతాలలో  ఉంచాలని సూచించారు.ATM  లలో డబ్బులు ఫీల్లింగ్ సమయంలో స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం ఇస్తే ఆ ప్రాంతంలోని బ్లూ క్లోట్స్, పెట్రో కార్ సిబ్బందిని అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు. ప్రతి బ్యాంకు అధికారులకు, సిబ్బందికి బ్యాంకు ఉన్న ప్రాంత పోలీస్ స్టేషన్ అధికారుల నెంబర్ లు తెలిసి ఉండాలి. హెల్ప్‌లైన్ మరియు పోలీస్ స్టేషన్‌ల సంప్రదింపు నంబర్‌లను బోల్డ్ అక్షరాలతో వ్రాసి బ్యాంకు లోపల తగిన ప్రదేశాలలో ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటివరకు, దొంగలు ఎక్కువగా బ్యాంకులు  రోజు తెరిచినప్పుడు లేదా మూసివేయబడిన సమయంలో మరియు వారి భోజన విరామ సమయంలో కూడా లక్ష్యంగా చేసుకున్నారు. కాబట్టి ఈ సమయంలో సెక్యూరిటీ గార్డుతో పాటు బ్యాంకు ఉద్యోగులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ప్రమాదకరమైన సంఘటన జరిగినప్పుడు డయల్ 100 కు ,స్థానిక పోలీస్ కి సమాచారం అందించాలని అన్నారు.బ్యాంకుల నుండి  బంగారం ,డబ్బులు డ్రా చేసుకొని వెళ్ళే వాళ్ళను లక్ష్యంగా చేసుకుని, వారిని అనుసరించి  దొంగతనలు చేస్తున్నారని వీటిని నివారించడానికి  బ్యాంకు బయట వాహనాలు నిలిపే ప్రాంతాలలో కూడా సిసి కెమరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాత్రి సమయం లో కూడా సెక్యూరిటీ గార్డ్స్ లను ఆకస్మికంగా వారి పనితీరు ను తనిఖీ చేయాలని బ్యాంకు మేనేజర్లకు సూచించారు.


ఈ సమావేశం లో  డిఎస్పీ రఘు చందర్,SB  ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, బ్యాంకు  అధికారులు  పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

బీజేపీ సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యశాల

బీజేపీ సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యశాల జగిత్యాల  జనవరి 20 (  ప్రజా మంటలు     )భారతీయ జనతా పార్టీ "సంవిధాన్ గౌరవ అభియాన్" కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కార్యశాల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి  నరేంద్ర...
Read More...
National  State News  International  

మ్యూనిచ్ లో రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం

మ్యూనిచ్ లో రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం మ్యూనిచ్ లో రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం మ్యూనిచ్ జనవరి 20: దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) సదస్సులో పాల్గొనడానికి జ్యూరిచ్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందానికి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.  ముఖ్యమంత్రి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం జ్యూరిచ్ విమానాశ్రయం చేరుకోగానే అక్కడ...
Read More...
Local News 

ముదిరాజ్​లను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలి

ముదిరాజ్​లను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలి ముదిరాజ్​లను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలి- అఖిల భారతీయ కోలి ముదిరాజ్ జాతీయ కార్యవర్గ తీర్మానం సికింద్రాబాద్​, జనవరి 20 ( ప్రజామంటలు): దీర్ఘకాలికంగా పెండింగ్​ లో ఉన్న ముదిరాజ్​ కమ్యూనిటీని బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చే ప్రతిపాదనను వెంటనే అమలు చేయాలని పలువురు వక్తలు...
Read More...
Local News 

పిల్లల భద్రతే  మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్

పిల్లల భద్రతే  మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ పిల్లల భద్రతే  మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్    జగిత్యాల జనవరి 20  (ప్రజా మంటలు):స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమాదం జరిగిన సంబంధిత డ్రైవరు, యాజమాన్యం పై  కఠినంగా వ్యవహరిస్తాం.విద్యాసంస్థల ప్రతి వాహనానికి తప్పనిసరిగా రోడ్  ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి చే...
Read More...
Local News 

ప్రవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎస్ఐ సిహెచ్.సతీష్ 

ప్రవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎస్ఐ సిహెచ్.సతీష్  ప్రవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎస్ఐ సిహెచ్.సతీష్  గొల్లపల్లి జనవరి 20 (ప్రజా మంటలు): జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకురోడ్డు మరియు రహదారి భద్రత  మాసవోత్సవం   సందర్భంగా  గొల్లపల్లి మండల లోని ప్రైవేట్ స్కూల్ బస్సులను  ఎస్ఐ,సతీష్ తనిఖీలు చేశారు. ఆయన మాట్లాడుతూ, మాట్లాడుతూ పిల్లల్ని స్కూలుకు ఇంటికి వరకు...
Read More...
Local News 

భార్య చనిపోగా భర్త మానసిక వేదనతో  ఆత్మహత్య

భార్య చనిపోగా భర్త మానసిక వేదనతో  ఆత్మహత్య భార్య చనిపోగా భర్త మానసిక వేదనతో ఆత్మహత్య ఇబ్రహీంపట్నం జనవరి 20( ప్రజా మంటలు): ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని  గోదురు గ్రామానికి చెందిన రెబ్బసి శాంత మూడు నెలల క్రితం మరణించగా తన భర్త రెబ్బసి ఆశన్న, భార్య గురించి తలుచుకుంటూ మానసిక వేదనకు గురవుతూ ప్రతిరోజు బాధపడుతుండెవాడని  సోమవారం  ఇటలీ ఎవరు లేని సమయంలో...
Read More...
Local News 

మధ్యాహ్న భోజన పథకం లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలి - వర్కర్స్ యూనియన్ వినతి పత్రం

మధ్యాహ్న భోజన పథకం లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలి - వర్కర్స్ యూనియన్ వినతి పత్రం   మధ్యాహ్న భోజన పథకం లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలి - వర్కర్స్ యూనియన్ వినతి పత్రం మెట్టుపల్లి జనవరి 20( ప్రజా మంటలు) తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ అనుబంధ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో  పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలని మెట్పల్లిలోని మండల విద్యాశాఖ అధికారికి మధ్యాహ్న భోజన...
Read More...
Local News 

మీత అయ్య వార్ల అధ్యక్షునిగా తిరు కోవేల నరసయ్య, 

మీత అయ్య వార్ల అధ్యక్షునిగా తిరు కోవేల నరసయ్య,  మీత అయ్య వార్ల అధ్యక్షునిగా తిరు కోవేల నరసయ్య,  మెట్టుపల్లి జనవరి 26 (ప్రజా మంటలు) మెట్టుపల్లి  డివిజన్ మిత అయ్యవారు అధ్యక్షుని గా తిరు కోవెల  నరసయ్య, ఉపాధ్యక్షులుగా సాత్పడిఅశోక్, ప్రధాన కార్యదర్శిగా గడ్డల కాంతయ్య, కోశాధికారి గా ధర్మపురి పురుషోత్తం ను ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు మెట్టుపల్లి లో సోమవారం జరిగిన మిత అయ్యవార్ల...
Read More...
Local News 

ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి  ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి  ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్  ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి  ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్  ధర్మపురి జనవరి 20:   దక్షిణ కాశీగా, హరిహర క్షేత్రంగా, గోదావరి తీరాన వెలసి, మున్సిపాలిటీ, మండల, నియోజక వర్గ కేంద్రంగా, నిత్య భక్త జన సందడితో అలరారే ధర్మపురి క్షేత్రం సమగ్రాభివృద్ధికి కృషి సల్పగనని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరిలక్ష్మణ్ కుమార్...
Read More...
Local News 

కాంగ్రెస్​ నేతలు కంటి పరీక్షలు  చేయించుకోవాలి  * బీఆర్​ఎస్​ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..?

కాంగ్రెస్​ నేతలు కంటి పరీక్షలు  చేయించుకోవాలి  * బీఆర్​ఎస్​ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..? కాంగ్రెస్​ నేతలు కంటి పరీక్షలు  చేయించుకోవాలి  * బీఆర్​ఎస్​ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..? సికింద్రాబాద్, జనవరి 20 (ప్రజామంటలు): బీఆర్​ఎస్​ ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులు కాంగ్రెస్​ నాయకులకు కనింపించకపోతే, కంటి పరీక్షలు చేయించుకోవాలని బన్సీలాల్​ పేట డివిజన్​ బీఆర్​ఎస్​ ప్రెసిడెంట్​ ఎల్​.వెంకటేశన్​ రాజు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...మాజీ మంత్రి,...
Read More...
Local News 

ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా  సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలి

ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా  సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలి ఎస్పీ అశోక్   జగిత్యాల జనవరి 20(  ప్రజా మంటలు  )జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా  వ్యాప్తంగా  ఉన్న  వివిధ బ్యాంకుల్లో పని చేస్తున్న బ్యాంకు అధికారులతో  బ్యాంకుల, ఏటీఎంల  వద్ద భద్రతా ప్రమాణాలు, సిసి కెమెరాల ఏర్పాటు, ఆర్థిక నేరాలు, గతంలో   జరిగిన బ్యాంకు మరియు ఏటీఎం సంబందించిన నేరాల గురించి, భవిష్యత్తు లో...
Read More...