పెన్షనర్ల గోడు కేంద్రం పట్టించు కోదా?ఈసారైనా కేంద్ర బడ్జెట్ కరుణించేనా..?
పెన్షనర్ల గోడు కేంద్రం పట్టించు కోదా?ఈసారైనా కేంద్ర బడ్జెట్ కరుణించేనా..?
-ఎనిమిదేళ్లు గా తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదాయపు పన్ను మినహాయింపుకు పెన్షనర్ల ఆందోళనలు.-ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్న కొత్త ఆదాయపు పన్ను బిల్లు.
జగిత్యాల జనవరి 19::
కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టం 1961 అనేది ఆరు దశాబ్దాల క్రితం నాటిది కాగా 2025 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరుగనున్న 2025-26కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశ పెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది.ఈ నేపథ్యంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం లో నైనా తమను కరుణించి ఆదాయపు పన్ను నుంచి మినహయిస్తారా?అంటూ ప్రభుత్వ పెన్షనర్లు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు . గత ఎనిమిది ఏళ్లుగా కరీంనగర్ , జగిత్యాల,,పెద్దపల్లి,సిరిసిల్ల జిల్లాల్లో తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో అసోసియేషన్ పిలుపు మేరకు పెన్షనర్లను ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కోరుతూ ప్రధాన మంత్రి కి,కేంద్ర ఆర్ధికమంత్రి కి పోస్ట్ కార్డులపై వినతులు పంపుతున్నారు.కలెక్టర్,ఆర్డీవో కార్యాలయాల ఎదుట ప్రతి ఏటా బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు ధర్నాలు చేస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా పెన్షనర్లు గత 8 ఏళ్ళుగా ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేస్తున్నారు.పెన్షనర్స్ జేఏసీ కేంద్ర చైర్మన్ గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో ఢిల్లీలో కేంద్ర ఆర్ధికమంత్రికి,ఎంపీలకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు.ఈసారి కూడా తమ ఆశలు వమ్ము చేస్తే మళ్ళీ మార్చి మొదటి వారంలో ధర్నాలు ,వినతిపత్రాలు అందజేసి ,అలాగే ప్రధాన మంత్రికి,కేంద్ర ఆర్థిక మంత్రికి పోస్ట్ కార్డులు పంపుతూ డిమాండ్ చేస్తామని అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా అధ్యక్షుడు,రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ ప్రధాన,కార్యదర్శి బొల్లం విజయ్, సహాయ అధ్యక్షుడు పి.సి.హన్మంత రెడ్డి,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం, ఉపాధ్యక్షులు వెల్ముల ప్రకాశ్ రావు,దిండిగాల విఠల్, ఎం.డి.యాకూబ్,ఆర్గనైజింగ్ కార్యదర్శులు పూసాల ఆశోక్ రావు, కే.సత్యనారాయణ,మహిళా కార్యదర్శి బొబ్బటి కరుణ, జగిత్యాల యూనిట్ అధ్యక్షుడు బి.రాజేశ్వర్, కార్యదర్శి ఎం.డి.ఎక్బాల్,కోరుట్ల యూనిట్ అధ్యక్షుడు పబ్బా శివానందం,కార్యదర్శి జి.రాజ్ మోహన్,సైఫోద్దీన్ ,లక్ష్మీ నారాయణ,మెట్ పల్లి అధ్యక్షుడు గంగాధర్,,ధర్మపురి అధ్యక్షుడు కండ్లే గంగాధర్, గంగాధర్,మల్యాల అధ్యక్షుడు యాకూబ్,మెట్ పల్లి అధ్యక్షుడు వి. ప్రభాకర్ రావు, తదితరులు జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ప్రకటించారు.పెన్షనర్ల ఆందోళనకు టీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు మిర్యాల నాగేందర్ రెడ్డి, తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం.డి.వకీల్ లు మద్దతు తెలుపుతున్నారు.
అనంతరం పెన్షనర్ల అస్సోసియేషన్ ప్రతినిధులు జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో,డివిజన్,మండల కేంద్రాలలో గత ఎనిమిది ఏళ్లుగా ఆయా యూనిట్ల ప్రతినిధులు తమ కార్యలయాల నుండి పోస్ట్ ఆఫిసుకు ర్యాలీగా వెళుతూ పోస్టల్ బాక్స్ వద్దకు వెళ్లి ప్రధాన మంత్రికి,కేంద్ర ఆర్ధికమంత్రి ని పెన్షనర్ల కు ఆదాయపు పన్ను రద్దుచేయాలని కోరుతూ పోస్ట్ కార్డులపై రాసి పోస్టల్ డబ్బాలో వేస్తున్నారు. ప్రత్యేకముగా ప్రధాన మంత్రికీ,కేంద్ర ఆర్ధికమంత్రి కి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పెన్షనర్లకు ఆదాయపు పన్ను రద్దు చేయాలని వినతి పత్రాలు పంపుతున్నారు.
ఆదాయపు పన్ను నుంచి పెన్షనర్లను మినహాయించాలి. -హరి ఆశోక్ కుమార్,రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్,జగిత్యాల జిల్లా. ఏదైనా సర్వీస్ చేయడానికి విధులు నిర్వర్తిస్తూ పొందే ఆదాయం పై పన్ను విధింపు సబబే.కానీ రిటైర్డ్ ఉద్యోగులకు,ఉపాధ్యాయులకు ప్రతి నెలా ప్రభుత్వం ఇచ్చే గౌరవ భృతి పెన్షన్ పై ఆదాయపు పన్ను విధించడం సరి కాదు.ఉద్యోగులకు సైతం ఆదాయపు పన్ను పరిమితిని రూ.16 లక్షలకు పెంచాలని మాజీ టీ ఉద్యోగుల జేఏసీ నేతగా కేంద్రాన్ని కోరుతున్నాము.1ఫిబ్రవరి 2025 న ప్రవేశపెడుతున్న 2025-2026సంవత్సరం బడ్జెట్ లో నైనా కేంద్రం కరుణించి పెన్షనర్లని ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు చెయ్యాలని,చేసే వరకు మా ఉద్యమాలురాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతాయన్నారు. ఉద్యోగులకు సైతం ఆదాయపు పన్ను 16 లక్షలకు పరిమితం చేయాలన్నారు.