శ్రీనివాస మిత్రుల ఘనంగా తొలి వార్షికోత్సవం రక్తదానం
జగిత్యాల జనవరి 19( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో జగిత్యాల జిల్లా శ్రీనివాస మిత్రుల మొదటి వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్. శ్రీనివాస్ జిల్లా ఉప వైద్యాధికారి , జగిత్యాల వాట్సాప్ అడ్మిన్ రాజేశుని శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ జగిత్యాల , డాక్టర్ రాచకొండ శ్రీనివాస్, ఊట్కూరి శ్రీనివాసరెడ్డి, టి ఎస్ ఎస్ చైర్మన్, డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి, జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించారు.
ఈ వార్షికోత్సవానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి 300 మందికి పైగా శ్రీనివాసులు తరలివచ్చారు. అనంతరం రక్తదాన శిబిరం ప్రారంభించి తలసేమియా భాధితులకు రక్తదానం చేసారు.
రక్తదాన శిబిరంలో 40 మంది శ్రీనివాసులు పాల్గొని రక్తదానం చేసారు. రక్తదానం చేసిన వారందరికీ రెడ్ క్రాస్ సంస్థ వారి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.
ఇట్టి కార్యక్రమం లో పిట్టల శ్రీనివాస్, పాక శ్రీనివాస్, పాత శ్రీనివాస్, గుండి శ్రీనివాస్ శర్మ, గాజుల శ్రీనివాస్ మరియు జగిత్యాల జిల్లా లోని వివిధ మండలాలనుండి వచ్చిన తదితర శ్రీనివాస
పేరు గల సభ్యులు 300 మంది పాల్గొన్నారు.