ముదిరాజ్లను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలి
ముదిరాజ్లను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలి
- అఖిల భారతీయ కోలి ముదిరాజ్ జాతీయ కార్యవర్గ తీర్మానం
సికింద్రాబాద్, జనవరి 20 ( ప్రజామంటలు):
దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ముదిరాజ్ కమ్యూనిటీని బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చే ప్రతిపాదనను వెంటనే అమలు చేయాలని పలువురు వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం అఖిల భారత కోలి(ముదిరాజ్) సమాజ్ జాతీయ మహాసభ ఎగ్జిక్యూటివ్ సమావేశం మాదాపూర్ కావూరి హిల్స్ లో జరిగింది. ఈసమావేశం మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ర్ట ముదిరాజ్ మహాసభ అద్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా జాతీయ కోలీ ముదిరాజ్ అద్యక్షులు, గుజరాత్ రాష్ర్ట మంత్రి కున్వర్జీ భాయ్ బవాలియా జీ, ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ హాజరయ్యారు. ఈసందర్బంగా ఆయా రాష్ర్టాల్లోని ముదిరాజ్ కమ్యూనిటీ సమస్యలపై చర్చించారు. సమావేశంలో జాతీయ కోలీ ముదిరాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్లు, రాష్ర్ట ప్రతినిధులు కేసరి మహేందర్, నాగయ్య,ఎం.సురేశ్ పాల్గొన్నారు.: